
Infinix Note Edge 5g Available For Just 9k On Flipkart Freedom Sale 325476
Infinix Note Edge 5G Offer: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G (Infinix Note Edge 5G) స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది.
Infinix Note Edge 5G Offer: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G (Infinix Note Edge 5G) స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. దీనిని ఎక్చేంజ్ ఆఫర్‌తో పాటు మరికొన్ని ఆఫర్స్ వినియోగించి కొనుగోలు చేసేవారికి రూ.9,774కే దీనిని సొంతం చేసుకోవచ్చు.
Infinix Note Edge 5G Offer: ఇన్ఫినిక్స్ (Infinix) బ్రాండ్‌కి సంబంధించిన మంచి స్మార్ట్‌ఫోన్ ఏదైన కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీకు మంచి సమయం రానే వచ్చేసింది. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్రిడమ్ సేల్‌లో భాగంగా ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G స్మార్ట్‌ఫోన్ చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే, దీనిపై లభిస్తున్న ఆఫర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G (Infinix Note Edge 5G) స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్స్‌తో అందుబాటులోకి వచ్చింది.. ఇది చాలా ప్రత్యేకమైన 7.2mm స్లిమ్ డిజైన్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా 3D కర్వ్డ్ డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇది ఎంతో శక్తివంతమైన 6500mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది.
ఈ మొబైల్ మోస్ట్ పవర్ఫుల్ 6.78-అంగుళాల 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా 120Hz రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7100 (6nm) ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది.
ఇక వెనక భాగంలో ఇది మోస్ట్ పవర్ఫుల్ 50MP ప్రధాన కెమెరా సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇక ఫ్రంట్ భాగంలో 13MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ఈ రెండు కెమెరాలతో 2K 30fps వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుందని కంపెనీ క్లైమ్ చేస్తోంది. ఇది ఎంతో శక్తివంతమైన 6500mAh భారీ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. అలాగే 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది.
ఈ Infinix Note edge స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత XOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. దీనికి కంపెనీ 3 మేజర్ OS అప్డేట్స్తో పాటు 5 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను హామీ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఇందులో JBL ట్యూన్ చేసిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో పాటు చాలా ప్రత్యేకమైన ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్‌లను కూడా కలిగి ఉంటుంది.
ఇక Infinix Note edge ఫ్రీడమ్ సేల్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం బేస్ వేరియంట్ (128 GB + 6 GB) మొబైల్‌పై ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. దీని ధర MRP రూ.26,999 కాగా.. ఇప్పుడే దీనిని ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి రూ.2,000 వరకు ఫ్లాట్ తగ్గింపు కూడా లభిస్తుంది. దీంతో ఇది కేవలం రూ.24,999కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
దీనిపై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. Flipkart Axis, Flipkart SBI బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.1,250 వరకు తగ్గింపు కూడా పొందవచ్చు. ఇవే కాకుండా అదనంగా ఎక్చేంజ్ ఆఫర్ వినియోగిస్తే ఏకంగా రూ.13,975 వరకు బోనస్ కూడా లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్ పోనూ రూ.9,774కే సొంతం చేసుకోవచ్చు.



