
విదేశాల నుంచి మన దేశానికి కుక్కలు, పిల్లులు, గుర్రాలు, పశువులు, పక్షులు సహా.. పెంచుకునే ఏ ఇతర జంతువులను తీసుకొచ్చినా.. వాటిని వెంటనే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు అనుమతించరు. అలాగే ఇక్కడి నుంచి ఇతర దేశాలకు పంపినా అక్కడి నిబంధనలను పాటించాలి. దీనికోసం విమానాశ్రయాల్లో ప్రత్యేకంగా యానిమల్ క్వారంటైన్ అండ్ సర్టిఫికేషన్ సర్వీస్(ఏక్యూసీఎస్) అనే ప్రత్యేకమైన విభాగమే ఉంది. ఇది కేంద్ర పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. ప్రస్తుతం మన దేశంలో దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో మాత్రమే ఏక్యూసీఎస్ కేంద్రాలున్నాయి. ఈ విషయంలో విధివిధానాలు ఏముంటాయంటే... మన దేశం నుంచి ఇతర దేశాలకు పెంపుడు జంతువులను తీసుకెళ్లాలంటే.. ఆ దేశ ప్రవేశ నిబంధనలు, విమాన సంస్థల మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి. మైక్రోచిప్: ఐఎస్వో ప్రమాణాలతో కూడిన మైక్రోచిప్‌ను పెట్స్‌కు వేయించాలి. వాక్సిన్ రికార్డు: రేబిస్, ఇతర టీకాలు వేయించిన ధ్రువీకరణ పత్రాలుండాలి. హెల్త్ సర్టిఫికెట్: ప్రయాణానికి ముందు వెటర్నరీ వైద్యులు ఇచ్చిన ధ్రువీకరణపత్రాలు సమర్పించాలి. ఇంపోర్ట్ పర్మిట్: ఏ దేశానికి తీసుకెళ్తారో.. అక్కడి ప్రభుత్వం జారీ చేసిన అనుమతిపత్రం ఉండాలి. ఎన్వోసీ: ఏక్యూసీఎస్ విభాగం నుంచి అడ్వాన్స్ ఎన్వోసీ తీసుకోవాలి. జంతువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏక్యూసీఎస్ విభాగం పనిచేస్తోంది. జంతువుల ద్వారా మాదకద్రవ్యాల రవాణాను అడ్డుకుంటాయి. బయో టెర్రరిజం లాంటి ముప్పును నివారించడానికి కూడా క్వారంటైన్ ప్రక్రియ ఉపయోగపడుతుంది. మన దేశంలో 1969లో మొదటిసారి ఈ యానిమల్ క్వారంటైన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. తొలుత దిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబయి విమానాశ్రయాల్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్‌కు విస్తరించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా