
కేబీఆర్ పార్క్ చుట్టూ పెరుగుతున్న వాహనాల రద్దీని తగ్గించడం కోసం హెచ్-సిటీ ప్రాజెక్టు కింద పలు కీలక మౌలిక వసతుల పనులు చేపడుతున్నారు. దాదాపు రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో ఏడు మల్టీ లెవల్ స్టీల్ ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. ఇప్పటికే కొన్ని పిల్లర్ల పనులు ప్రారంభమయ్యాయి. ఒకేసారి మరిన్ని పిల్లర్లకు ఫౌండేషన్ పనులు చేపట్టేందుకు రహదారులపై అవసరమైన స్థలం కల్పించాల్సి ఉండటంతో వన్‌వే విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపులపై తుది నిర్ణయం తీసుకునే ముందు ఏప్రిల్ 5, జూన్ 21 తేదీల్లో ట్రయల్ రన్లు నిర్వహించారు. వాటి అనుభవాలను పరిశీలించిన తర్వాత ప్రస్తుత విధానాన్ని అమలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ లేదా ఐటీ కారిడార్ వైపు వెళ్లే వాహనదారులు ఇకపై పాత రూట్‌ను పూర్తిగా ఉపయోగించలేరు. రోడ్ నంబర్ 10, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, మహారాజా అగ్రసేన్ జంక్షన్, జర్నలిస్ట్ కాలనీ మీదుగా నిర్దేశించిన వన్‌వే మార్గంలో ప్రయాణించి రోడ్ నంబర్ 45కు చేరుకోవచ్చు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, మాదాపూర్, ఐటీ కారిడార్ వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. మరోవైపు పంజాగుట్ట నుంచి వచ్చే వాహనాలు ఎన్టీఆర్ భవన్ సిగ్నల్ వద్ద ఎడమవైపు మళ్లి బసవతారకం, అగ్రసేన్ జంక్షన్, జర్నలిస్ట్ కాలనీ మీదుగా కూడా రోడ్ నంబర్ 45కు చేరుకోవచ్చు. రోడ్ నంబర్ 45, జర్నలిస్ట్ కాలనీ వైపు నుంచి వచ్చే వాహనాలు BVB జంక్షన్ దాటి చెక్‌పోస్ట్ వైపు వెళ్లవచ్చు. వెంకటగిరి, ఇందిరానగర్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు వెంకటగిరి రోడ్డు ప్రధాన మార్గంగా ఉంటుంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 నుంచి ఎన్టీఆర్ భవన్ లేదా అన్నపూర్ణ స్టూడియో ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు కూడా మార్పులు చేశారు. గతంలో మహారాజా అగ్రసేన్ ఐలాండ్ వద్ద కుడివైపు మలుపు తీసుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం