హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు శాస్త్రీయ పరిష్కారం కనుగొనే దిశగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అడుగులు వేస్తోంది. నగరంలో రద్దీకి అసలు కారణాలు ఏమిటి? ఎక్కడ మౌలిక వసతులు మెరుగుపర్చాలి? ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపడితే ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది? వంటి అంశాలను ముందుగానే అంచనా వేసేందుకు ట్రాఫిక్ సిమ్యులేషన్ విధానంలో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఇతర ప్రభుత్వ విభాగాలతో సమన్వయంతో ఈ ప్రణాళికను అమలు చేయనుంది.తొలి దశలో కేబీఆర్ పార్కు, జీవీకే, నానల్‌నగర్ కారిడార్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సిమ్యులేషన్ అధ్యయనం నిర్వహించనున్నారు. నగరంలోని కీలక జంక్షన్లు, రద్దీ కారిడార్లలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించకపోవడంతో ఈ విధానంపై అధికారులు దృష్టి సారించారు. ఇప్పటివరకు వాహనాల రద్దీని అంచనా వేయకుండా ఫ్లైఓవర్లు, రహదారి విస్తరణలు, సిగ్నల్ మార్పులు చేపట్టడం వల్ల కొన్ని ప్రాంతాల్లో సమస్య పరిష్కారం కాకపోగా.. అనుసంధాన మార్గాల్లో మరింత రద్దీ పెరిగిన సందర్భాలు ఉన్నాయి.ట్రాఫిక్ సిమ్యులేషన్ అనేది కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఆధారంగా రహదారులు, జంక్షన్లు, వాహనాల రాకపోకలను వర్చువల్‌గా రూపొందించి విశ్లేషించే అధునాతన పద్ధతి. కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం, రోడ్డు విస్తరణ, సిగ్నల్ వ్యవస్థలో మార్పులు చేస్తే వాటి ప్రభావం ఎలా ఉంటుందో పనులు ప్రారంభించకముందే అంచనా వేయవచ్చు. విదేశాల్లో విస్తృతంగా వినియోగిస్తున్న ఈ సాంకేతికతను హైదరాబాద్‌లోనూ అమలు చేయడం ద్వారా ట్రాఫిక్ ప్రణాళికల్లో మరింత కచ్చితత్వం సాధించవచ్చని అధికారులు భావిస్తున్నారు.అధ్యయనంలో భాగంగా తొలుత సంబంధిత ప్రాంతానికి సంబంధించిన వాస్తవ సమాచారాన్ని సేకరిస్తారు. రహదారి వెడల్పు, గంటకు ప్రయాణించే వాహనాల సంఖ్య, వాహనాల వేగం, జంక్షన్ల వద్ద సిగ్నల్ టైమింగ్స్, లేన్ల సంఖ్య తదితర వివరాలను కంప్యూటర్ మోడల్లో నమోదు చేస్తారు. అనంతరం మైక్రోస్కోపిక్, మెసోస్కోపిక్, మాక్రోస్కోపిక్ పద్ధతుల్లో ట్రాఫిక్ ప్రవాహాన్ని విశ్లేషిస్తారు. మైక్రోస్కోపిక్ విశ్లేషణలో ఒక్కో వాహనం వేగం, లేన్ మార్పులు, ముందు వాహనంతో ఉండే దూరం వంటి అంశాలను పరిశీలిస్తారు. మెసోస్కోపిక్