గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు నిమ్స్ ఆసుపత్రిలో పూర్తిగా ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. ఆగస్టు 13 నుంచి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. నిమ్స్ కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగం హెచ్ఓడీ ప్రొఫెసర్ అమరేశ్వర్ నేతృత్వంలో శస్త్రచికిత్సలు జరగనున్నాయి. లండన్‌కు చెందిన వైద్యులు, పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమణ తన్నషునేని, సాంకేతిక నిపుణుల బృందం సహకారంతో ఈ శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ వెల్లడించారు. గుండె లోపాలు, పుట్టుకతో వచ్చే గుండె సంబంధిత సమస్యలు తదితర వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులను వైద్యులు పరీక్షించి, శస్త్రచికిత్స అవసరమున్న వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నారు.చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు అందించే కార్యక్రమాన్ని నిమ్స్‌లో గత ఐదేళ్లుగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే కుటుంబాలకు ఈ కార్యక్రమం ద్వారా పెద్ద ఊరట లభించనుంది. సాధారణంగా చిన్నారుల గుండె శస్త్రచికిత్సలకు భారీగా ఖర్చవుతుండటంతో అర్హత ఉన్న కుటుంబాలకు ఈ ఉచిత వైద్య సేవలు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి. ఈసారి కూడా అవసరాన్ని బట్టి చిన్నారులకు ప్రాధాన్యత కేటాయించి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వాక్-ఇన్ విధానంలో వచ్చే చిన్నారులను పరిశీలించి, అవసరమైన వైద్య పరీక్షలు, స్కానింగ్, ఇతర నిర్ధారణ ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం శస్త్రచికిత్స అవసరమున్నవారిని ఎంపిక చేస్తారు.ఎక్కడ సంప్రదించాలంటే..చిన్నారుల తల్లిదండ్రులు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య నిమ్స్ ఆసుపత్రిలోని సీటీ సర్జరీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ఇది పాత బ్లాక్ మొదటి అంతస్తులో, పంజాగుట్టలోని నిమ్స్ ప్రాంగణంలో ఉంది. వివరాల కోసం 040-2348-9025 నంబర్లో సంప్రదించాలని అధికారులు సూచించారు. చిన్నారులకు గతంలో నిర్వహించిన వైద్య పరీక్షలు, స్కానింగ్, చికిత్సలకు సంబంధించిన పాత రిపోర్టులు అందుబాటులో ఉంటే తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. దీనివల్ల వైద్యులు గత వైద్య చరిత్రను పరిశీలించి