
Hyderabad Metro Phase 2 Cm Revanth Reddy Orders Tenders For Old City Corridor Procure New Coaches 501205
హైదరాబాద్ మెట్రోను పురోగతి మార్గంలో నడపాలని, మెట్రో సేవలతో ప్రజల రవాణా అవసరాలను తీర్చాలని, తద్వారా రాష్ట్ర ప్రగతికి బాటలు వెయ్యాలని తెలంగాణా ప్రభుత్వం సంకల్పిస్తున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్ మెట్రోను పురోగతి మార్గంలో నడపాలని, మెట్రో సేవలతో ప్రజల రవాణా అవసరాలను తీర్చాలని, తద్వారా రాష్ట్ర ప్రగతికి బాటలు వెయ్యాలని తెలంగాణా ప్రభుత్వం సంకల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో తాజాగా హైదరాబాద్ మెట్రో విస్తరణలో ముఖ్యమైన అడుగు వేసింది తెలంగాణా సర్కార్.పాతబస్తీ మెట్రో కారిడార్ పనులను వేగవంతం చేయాలని ఆదేశం హైదరాబాద్ మెట్రో ఫేజ్-2లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల పాతబస్తీ మెట్రో కారిడార్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నేడు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు ఆయన కీలక సూచనలు చేశారు. ఈ మార్గానికి సంబంధించిన టెండర్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, రోడ్డు విస్తరణ పనులపై దిశా నిర్దేశం పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, రోడ్డు విస్తరణ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రోడ్డు విస్తరణ, భూసేకరణ, టెండర్ల ప్రక్రియలను సమన్వయం చేసుకుంటూ ఎలాంటి జాప్యం లేకుండా ముందుకు వెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పాతబస్తీ ప్రాంతానికి మెట్రో సేవలు అందుబాటులోకి వస్తే అక్కడి ప్రజలకు ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని సీఎం పేర్కొన్నారు.మెట్రో రైళ్లకు కొత్త కోచ్‌లు జత చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్మాణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులను సంప్రదించి అవసరమైన సాంకేతిక సలహాలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మాణం, నిర్వహణ, ప్రయాణికుల సౌకర్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మరోవైపు ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో మెట్రో రైళ్లకు కొత్త కోచ్‌లు జత చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుత సామర్థ్యానికి అదనంగా కొత్త కోచ్‌లను కొనుగోలు చేసి రైళ్లకు జోడించాలని అధికారులను ఆదేశించారు.200 కోట్ల రూపాయలతో రైతుల కోసం .. అత్యాధునిక పూల, కూరగాయల మార్కెట్.. ఎక్కడంటేమెట్రో సేవల సామర్థ్యాన్ని పెంచేందుకు కీలక చర్య పీక్ అవర్స్‌లో రద్దీని తగ్గించడంతో పాటు మెట్రో సేవల సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ చర్య కీలకమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.ఈ నిర్ణయాలతో హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పనులు వేగం పుంజుకునే అవకాశం ఉంది. పాతబస్తీ కారిడార్ పూర్తయితే నగరంలోని ముఖ్య ప్రాంతాల మధ్య కనెక్టివిటీ మెరుగుపడి, ప్రజలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది.
