
Hyderabad : ఒకప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా.. ఇప్పుడు తెలంగాణ రాజధానిగా నిజాంల నగరం హైదరాబాద్ ఓ వెలుగు వెలుగుతోంది. దక్కన్ పీఠభూమిపై వెలిసిన ఈ నగరానికి నాలుగు శతాబ్దాలకు పైగా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. విశిష్టమైన సంస్కృతి, సాంప్రదాయాలు, చారిత్రక వైవిధ్యం సమ్మిళితమైన ఈ మహానగరం నేడు ప్రపంచ పటంలో తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అయితే ఈ నగరానికి 'హైదరాబాద్' అనే పేరు ఎలా వచ్చింది? అనే అంశంపై చారిత్రకారుల్లో, ప్రాచుర్యంలో ఉన్న కథనాల్లో భిన్నమైన ఆసక్తికరమైన అభిప్రాయాలు ఉన్నాయి. కుతుబ్ షాహీల నాటి ప్రేమకథల నుంచి మతపరమైన విశ్వాసాల వరకు ఈ నగర నామకరణం వెనుక ఉన్న చారిత్రక విశేషాలు ఎంతో ఆకట్టుకుంటాయి. మరి ఈ నవాబుల నగరానికి 'హైదరాబాద్' పేరు రావడం వెనకన్న ఆసక్తికర స్టోరీలను తెలుసుకుందాం. హైదరాబాద్ పేరుకు సంబంధించి అత్యంత ప్రాచుర్యంలో ఉన్న కథనం గోల్కొండ ఐదవ సుల్తాన్ ముహమ్మద్ కులీ కుతుబ్ షా, భాగమతిల ప్రేమాయణం. కుతుబ్ షా మూసీ నది ఒడ్డున ఉన్న చించల (నేటి చంచల్ గూడ) గ్రామానికి చెందిన భాగమతి అనే హిందూ యువతిని ప్రాణంగా ప్రేమించాడు. నాటి రాజవంశ నియమాలు, సామాజిక పరిస్థితుల ప్రకారం ఇతర మతానికి చెందిన మహిళను వివాహం చేసుకోవడం సులభం కాకపోవడంతో, భాగమతి ఇస్లాం మతాన్ని స్వీకరించి కుతుబ్ షాను వివాహమాడిందని కథలుకథలుగా చెప్పుకుంటారు. అయితే ఇస్లాం స్వీకరించిన అనంతరం భాగమతికి 'హైదర్ మహల్' అనే పేరు పెట్టారు. సుల్తాన్ తన ప్రియరాలిపై ఉన్న అమితమైన అనురాగంతో ఈ ప్రాంతానికి మొదట 'బాగ్ నగర్' అని పెట్టారు.. తదనంతరం ఆమె పేరు 'హైదర్ మహల్' ఆధారంగా 'హైదరాబాద్' (హైదర్ నగరం) అని మార్చినట్లు అనేకమంది చారిత్రకారులు విశ్లేషిస్తారు. మరొక చారిత్రక కథనం ప్రకారం.. హైదరాబాద్ పేరు వెనుక ఆధ్యాత్మిక కోణం ఉందనే వాదన కూడా ఉంది. ముహమ్మద్ కులీ కుతుబ్ షా అత్యంత