
కంటోన్మెంట్: న్యూ బోయిన్‌పల్లిలో సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలైన సీతారాంపురం, మరి రామ్ రెడ్డి కాలనీ, సాయిబాబా కాలనీ, శ్రీనివాస కాలనీ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. మోకాలు లోతుకు నీళ్లు చేరుకోవడంతో అటుగా రాకపోకలు సాగించే వాహనదారులతోపాటు స్థానికులకు ఇబ్బందులు తప్పలేదు. ఆయా ప్రాంతాలవాసులు ఇళ్లలోంచి బయటికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.