
ముందుగా తేలికపాటి ఫేస్ వాష్ ఉపయోగించి ముఖాన్ని బాగా క్లీన్ చేసుకోండి. దీంతో చర్మంపై దుమ్ము, ధూళి పోతాయి.
టవల్‌తో ముఖం తుడుచుకున్నాక నాణ్యమైన, కెమికల్ ఫ్రీ అలోవెరాను ముఖంపై పల్చటి పొరలాగా రాసుకోండి.
తర్వాత మీ చేతి వేళ్లతో వృత్తాకారంలో ముఖంపై మర్దన చేయండి. ఇలా చేయడం వల్ల చర్మం లోపలికి అలోవెరా వెళుతుంది.
రాత్రంతా అలాగే ఉంచి ఉదయం పూట చల్లటి నీళ్లతో ముఖం క్లీన్ చేసుకోండి. తర్వాత ముఖానికి సన్ స్క్రీన్ లేదా మాయిశ్చరైజర్ రాసుకోండి.
మీ చర్మం జిడ్డుగా ఉంటే అలోవెరా మందంగా రాసుకోవాలి. డ్రై స్కిన్ అయితే పల్చటి పొరలాగా రాసుకోవాలి. కాంబినేషన్ స్కిన్ ఉంటే చెక్కిళ్ల వద్ద మందంగా రాసి చివరలకు పల్చగా రాయాలి.
చర్మంపై ఎండ వల్ల ఏర్పడే సన్ బర్న్ (ఎర్రటి మచ్చలు) తొలగించడంలో అలోవెరా సహాయపడుతుంది.
రాత్రి పడుకుని ఉదయం లేచాక కొంతమంది కళ్ల కింద భాగం ఉబ్బినట్లుగా అనిపిస్తుంది. అయితే అలోవెరా రాసుకుంటే ఆ సమస్య ఉండదు.
మొటిమలు ఉన్నవారు కూడా రాత్రిపూట అలోవెరా రాసుకోవచ్చు. దీనివల్ల మొటిమల నొప్పి, మంట తగ్గుతాయి.
ముఖంపై నల్ల మచ్చల సమస్యతో బాధపడేవారు కూడా అలోవెరా రాత్రి అప్లై చేసుకోవచ్చు. దీంతో నల్ల మచ్చలు ఈజీగా పోతాయి.




