
బరువు తగ్గాలని చాలామంది అనుకుంటారు. కానీ బరువు తగ్గేటప్పుడు వేగం కంటే ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. సాధారణంగా వారానికి అర కేజీ నుంచి ఒక కేజీ వరకు తగ్గడం సురక్షితమైన పద్ధతిగా నిపుణులు చెబుతున్నారు. అంటే నెలకు 2 నుంచి 4 కేజీల వరకు తగ్గడం సాధ్యమే. అయితే ప్రతి ఒక్కరి శరీరం ఒకేలా ఉండదు. వయసు, ప్రస్తుత బరువు, ఆహారం, ఇతర ఆరోగ్య పరిస్థితులను బట్టి బరువు తగ్గే వేగం మారుతుంది. నెలలో 4 కేజీల వరకు తగ్గాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో కావాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. బరువు తగ్గాలంటే ముందుగా ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. అన్నం, రొట్టె లేదా ఇతర కార్బోహైడ్రేట్లను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అయితే వాటిని సరైన మోతాదులో తీసుకోవాలి. ప్లేట్లో కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పప్పులు, శనగలు, పెసలు, గుడ్లు, చేపలు, చికెన్ వంటి ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని కూడా తగిన మోతాదులో తీసుకోవాలి. పండ్లు, సంపూర్ణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు వంటి పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారం, కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన జ్యూస్‌లు, స్వీట్లు, బిస్కెట్లు, కేకులు, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటిని తగ్గించాలి. ముఖ్యంగా టీ, కాఫీలలో ఎక్కువ చక్కెర వేసుకునే అలవాటు ఉంటే క్రమంగా తగ్గించుకోవాలి. దాహం వేసినప్పుడు కూల్ డ్రింక్స్ లేదా షుగర్ డ్రింక్స్ కి బదులుగా నీటిని ఎంచుకోవడం మంచి అలవాటు. పండ్లను జ్యూస్‌గా తాగడం కంటే నేరుగా తినడం వల్ల ఫైబర్ కూడా లభిస్తుంది. ఎంత హెల్తీ ఫుడ్ అయినా మోతాదుకు మించి తింటే బరువు పెరగవచ్చు. అందుకే ఎంత తింటున్నాం? అనే విషయంపై దృష్టి పెట్టాలి. భోజనాన్ని నెమ్మదిగా తినాలి. టీవీ లేదా మొబైల్ చూస్తూ తినడం తగ్గిస్తే ఎంత తింటున్నామో మనకు బాగా తెలుస్తుంది. ఆకలి లేకపోయినా