
రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్లో పునర్నియామాల కోసం దాదాపు 2 నెలలుగా ఎదురుచూస్తున్న రిటైర్డ్ ఉన్నతాధికారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి రీ పోస్టింగ్లు ఇస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేషన్ ఉద్యోగు ల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం జూలై 2న ఉత్తర్వులు జారీ చేసింది.




