
ఇంఫాల్‌: మణిపుర్‌లో మరోసారి కలకలం చెలరేగింది. అనుమానిత ముష్కరులు ఆదివారం నలుగుర్ని కాల్చి చంపారు. తమెంగ్లాంగ్, నొనే జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. రెండు జిల్లాల్లో ఇద్దరి చొప్పున ప్రాణాలు కోల్పోయారు. మణిపుర్‌లో 1990ల్లో కుకీ, నాగా తెగల మధ్య చెలరేగిన ఘర్షణల్లో మరణించిన వారికి నివాళిగా కుకీలు ఏటా సెప్టెంబరు 13న ‘సహ్‌నీతీ నీ ఆఫ్‌ బ్లాక్‌ డే’ను పాటిస్తుంటారు. అదే రోజున ఈ కాల్పులు చోటుచేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆదివారం నాటి హత్యలను సీఎం వై ఖేమ్‌చంద్‌ సింగ్‌ ఖండించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





