
హానర్ మ్యాజిక్ 9 సిరీస్ లాంచ్ కన్ఫార్మ్ 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ సెటప్ స్టాండర్డ్ మ్యాజిక్ 9, మ్యాజిక్ 9 ప్రో మోడల్స్ Honor Magic 9 Series : హానర్ నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. హానర్ ఫ్లాగ్షిప్ సిరీస్ మ్యాజిక్ 9 లాంచ్ వివరాలను ధృవీకరించింది. ఇప్పటివరకు కంపెనీ మ్యాజిక్ 9 సిరీస్ ఫీచర్లను రివీల్ చేయలేదు. గత ఏడాదిలో వచ్చిన మ్యాజిక్ 8, మ్యాజిక్ 8 ప్రో స్థానంలో స్టాండర్డ్ మ్యాజిక్ 9, మ్యాజిక్ 9 ప్రో మోడల్స్ రెండూ ఉంటాయని భావిస్తున్నారు. కంపెనీ ఇప్పటికే చైనాలో ఈ లైనప్ కోసం ప్రీ-ఆర్డర్లను ప్రారంభించింది. హానర్ మ్యాజిక్ 9 సిరీస్ లాంచ్ అధికారికంగా రివీల్ చేయగా, ప్రీ-ఆర్డర్లతో పాటు కెమెరా పూర్తి వివరాలు కూడా లీక్ అయ్యాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.. కెమెరా ఫీచర్లు : హానర్ రోబోట్ ఫోన్ లాంచ్ ఈవెంట్లో మ్యాజిక్ 9 సిరీస్ సెప్టెంబర్‌లో చైనాలో లాంచ్ అవుతుందని కంపెనీ ధృవీకరించింది. జర్మన్ ఫిల్మ్ డివైజ్ బ్రాండ్ అర్రీ భాగస్వామ్యంతో ఈ లైనప్‌ను డెవలప్ చేస్తోంది. ఈ సిరీస్‌లో హానర్ యోయో ఏఐ అసిస్టెంట్ ఉంటుంది. అధికారిక టీజర్ సర్కిల్ రియర్ కెమెరా మాడ్యూల్తో వస్తుంది. 200MP పెరిస్కోప్ కెమెరా : ఈ కెమెరా సెటప్‌లో పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా మరో ప్రధాన ఆకర్షణ. లీకుల ప్రకారం.. ఇందులో 1/1.4-అంగుళాల సైజుతో 200MP సెన్సార్, ఎఫ్/2.6 అపెర్చర్ ఉండే అవకాశం ఉంది. Read Also : iQOO Phones Price Hike : ఐక్యూ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ఈ iQOO ఫోన్లపై రూ.10వేల వరకు పెంపు.. ఇక కొనడం కష్టమే..! డిస్ప్లే : హానర్ మ్యాజిక్ 9కి సంబంధించి డేటా ప్రకారం.. 6.36-అంగుళాల డిస్ప్లేతో రావచ్చు. అతి పెద్ద స్క్రీన్ డివైజ్ కన్నా ఒక చేత్తో ఈజీ క్యారీ చేయగల ఫ్లాగ్షిప్ ఫోన్ ఇష్టపడే యూజర్లకు ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కొత్త సిరీస్‌లో హానర్ ఏఐ ఫీచర్లపై కూడా ఫోకస్ పెట్టింది. వాయిస్ కమాండ్లు, స్మార్ట్ అసిస్టెన్స్, రోజువారీ టాస్కులకు ఏఐ సపోర్టు అందించే యోయో ఏఐ అసిస్టెంట్‌ను చేర్చనున్నట్లు ధృవీకరించింది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 : హానర్ మ్యాజిక్ 9 సిరీస్ ఫ్లాగ్షిప్-లెవల్ పర్ఫార్మెన్స్ అందించనున్నట్టు కనిపిస్తోంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 చిప్సెట్ అందించే తొలి స్మార్ట్ఫోన్లలో ఇదొకటి కానుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ చిప్సెట్ గేమింగ్, మల్టీటాస్కింగ్, ఏఐ ఆధారిత టాస్కులకు అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుందని భావిస్తున్నారు. పవర్ఫుల్ బ్యాటరీ : లీకుల ప్రకారం.. హానర్ మ్యాజిక్ 9 సిరీస్ అధికారిక స్టైలస్ యాక్సెసరీతో రావచ్చు. వివిధ ఏఐ-ఆధారిత ఫీచర్లతో ఉండొచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే.. లాంగ్ టైమ్ బ్యాకప్‌ను పవర్ఫుల్ 8,000mAh యూనిట్ అందిస్తుందని అంచనా. ప్రీ-ఆర్డర్లు : ప్రస్తుతం చైనాలోని హానర్ మాల్ స్టోర్ ద్వారా హానర్ మ్యాజిక్ 9 సిరీస్ ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. కంపెనీ ఈ రాబోయే హ్యాండ్‌సెట్‌ను “డేర్ టు థింక్ డిఫరెంట్లీ” అనే ట్యాగ్‌లైన్‌తో క్యాంపెయిన్ చేస్తోంది. అయితే, కంపెనీ ఇంకా కచ్చితమైన లాంచ్ తేదీని వెల్లడించలేదు.



