
ఉడికించిన లేదా తాజాగా చేసిన ఆమ్లెట్‌తో ఈ శాండ్విచ్ తయారు చేసుకోవచ్చు. టేస్ట్‌గా ఉంటుంది. ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది.
తురిమిన పనీర్‌లో క్యాప్సికమ్, ఉల్లిపాయ, టమాటా, మిరియాల పొడి కలిపి బ్రెడ్ మధ్యలో పెట్టి టోస్ట్ చేస్తే బాగుంటుంది.
చికెన్ ముక్కల్లో టమాటా, మిరియాల పొడి కలిపి ఈజీగా చేసుకోవచ్చు. క్షణాల్లో చేసేయచ్చు.
పీనట్ బటర్‌ను బ్రెడ్‌పై రాసి, అరటిపండు ముక్కలు పెట్టి తింటే బాగుంటుంది. ఇది మీకు కావాల్సినంత ప్రోటీన్ అందిస్తుంది.
హమ్మస్‌ను గోధుమ బ్రెడ్‌పై రాసి, పాలకూర, కీరదోస, టమాటా ముక్కలు పెట్టి తయారు చేసుకుంటే బాగుంటుంది.
పెసలు లేదా శనగ మొలకలను ఉల్లిపాయ, నిమ్మరసం, టమాటాతో కలిపి బ్రెడ్‌పై పెట్టి శాండ్విచ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది.
టోఫును తేలికగా వేయించి, కూరగాయలతో కలిపి బ్రెడ్‌పై పెట్టి తింటే బాగుంటుంది. శాకాహారులకు ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది.
గ్రీక్ యోగర్ట్‌లో మిరియాల పొడి, కొత్తిమీర, దోసకాయ కలిపి బ్రెడ్‌పై రాసి, కూరగాయలతో తింటే బాగుంటుంది.
అవకాడో, టమాటా, కీరదోస, పాలకూర ఆకులు, బ్రెడ్‌తో ఈ శాండ్విచ్ సులువుగా చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.






