
High Court Replaces Death Sentence With Life Imprisonment In Kurnool Double Murder Case
కర్నూలులో 2023 మార్చి 14న జరిగిన జంట హత్యలు అప్పట్లో పెద్ద సంచలనంగా మారాయి. పెళ్లయిన 14 రోజులకే భార్య, అత్తని వరుడు కుటుంబం కలిసి హత్య చేసింది. ఈ కేసు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కర్నూలులో 2023 మార్చి 14న జరిగిన జంట హత్యలు అప్పట్లో పెద్ద సంచలనంగా మారాయి. పెళ్లయిన 14 రోజులకే భార్య, అత్తని వరుడు కుటుంబం కలిసి హత్య చేసింది. ఈ కేసు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాట్లాడుకుందామని పిలిచి ఓ అపార్ట్మెంట్లో పక్కా ప్లాన్‌తో ఈ హత్యలకు పాల్పడ్డారు. ఈ కేసుపై హై కోర్టు తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది. ఈ జంట హత్యల కేసులో తండ్రీకొడుకులకు విచారణ కోర్టు మరణశిక్ష విధించింది. ఆ కేసు హైకోర్టుకు చేరడంతో మరణ శిక్షను తప్పించి క్షమాభిక్షకు వీలులేకుండా జీవితాంతం కఠిన కారాగార శిక్ష విధించింది.ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆసక్తికరంగా మారింది. మరణ శిక్ష విధించడానికి ఈ కేసు అత్యంత అరుదైనది కాదని స్పష్టం చేసింది. మరణ శిక్ష విధించే ముందు నేర తీవ్రతను మాత్రమే కాకుండా, నిందితుల స్థితిగతులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. శిక్షించడానికంటే ముందు నేరస్థుల్లో పరివర్తన తీసుకురావడానికి క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ ప్రాధాన్యం ఇస్తుందని గుర్తు చేసింది.గతంలో వారిపై నేర చరిత్ర లేదని గుర్తు చేసిన హైకోర్టు.. ఇద్దర్ని హత్య చేసి దారుణమైన నేరానికి పాల్పడినప్పటికీ నేరస్థుల్లో పరివర్తన రావడానికి అవకాశం ఉందని పేర్కొంది. సమాజానికి వారు ముప్పుగా మారతారని చెప్పేందుకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఈ కేసులో తండ్రీకొడుకులతో పాటు మూడో నిందితురాలిగా ఉన్న తల్లికి దిగువ కోర్టు విధించిన జీవిత కారాగార శిక్షణు హైకోర్టు కొట్టేసి, ఆమెను నిర్దోషిగా ప్రకటించి విడుదల చేయాలని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.సురేష్ రెడ్డి, జస్టిస్ హరిహరనాథ శర్మలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.READ ALSO Tirumal శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానంటూ స్కామ్.. సస్పెండైన టీటీడీ ఉద్యోగి అరెస్టుఈ కేసు వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. కర్నూలులోని చింతలమునినగర్‌కు చెందిన నారపురం వరప్రసాద్, కృష్ణవేణి దంపతుల కుమారుడైన శ్రావణ్ కుమార్‌కు 2023 మార్చి 1న తెలంగాణ రాష్ట్రం వనపర్తికి చెందిన వెంకటేశ్వర్లు, రమాదేవి దంపతుల కుమార్తె రుక్మిణితో వివాహమైంది. అయితే, పెళ్లయిన 10 రోజులకే భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడం, అది పెద్ద గొడవకు దారి తీయడం జరిగింది.ఈ క్రమంలో 2023 మార్చి 14న శ్రవణ్‌కుమార్ వనపర్తి వెళ్లి తన భార్య రుక్మిణి, అత్త రమాదేవి, మామ వెంకటేశ్వర్లును కర్నూలులోని తన ఇంటికి రాత్రి 11:30 గంటల సమయంలో తీసుకొచ్చాడు. మాట్లాడుతున్నట్టు నటించి శ్రవణ్‌కుమార్, అతడి తండ్రి వరప్రసాద్ కత్తులతో రుక్మిణి, ఆమె తల్లిదండ్రులపై దాడి చేశారు. ఈ ఘటనలో రుక్మిణి, రమాదేవి మృతిచెందగా వెంకటేశ్వర్లు గాయాలతో బయటపడ్డాడు. 2023 మార్చి 15న నిందితులను అరెస్టు చేయగా.. 2024లో కర్నూలు జిల్లా సెషన్స్ కోర్టు శ్రవణ్ కుమార్, వరప్రసాద్‌లకు మరణశిక్ష, శ్రవణ్ కుమార్ తల్లికి జీవిత ఖైదు విధించింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు శ్రవణ్ కుమార్, వరప్రసాద్‌లకు జీవతఖైదు, శ్రవణ్ తల్లి కృష్ణవేణిని నిర్దోషిగా ప్రకటిస్తూ తాజాగా తీర్పిచ్చింది.





