కర్నూలు జంట హత్యల కేసులో హైకోర్టు సంచలన తీర్పు.. తండ్రీకొడుకులకు తప్పిన మరణ శిక్ష
కర్నూలులో 2023 మార్చి 14న జరిగిన జంట హత్యలు అప్పట్లో పెద్ద సంచలనంగా మారాయి. పెళ్లయిన 14 రోజులకే భార్య, అత్తని వరుడు కుటుంబం కలిసి హత్య చేసింది. ఈ కేసు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాట్లాడుకుందామని పిలిచి ఓ అపార్ట్మెంట్లో పక్కా ప్లాన్‌తో ఈ హత్యలకు పాల్పడ్డారు. ఈ కేసుపై హై కోర్టు తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది. ఈ జంట హత్యల కేసులో తండ్రీకొడుకులకు విచారణ కోర్టు మరణశిక్ష విధించింది. ఆ కేసు హైకోర్టుకు చేరడంతో మరణ శిక్షను తప్పించి క్షమాభిక్షకు వీలులేకుండా జీవితాంతం కఠిన కారాగార శిక్ష విధించింది.ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆసక్తికరంగా మారింది. మరణ శిక్ష విధించడానికి ఈ కేసు అత్యంత అరుదైనది కాదని స్పష్టం చేసింది. మరణ శిక్ష విధించే ముందు నేర తీవ్రతను మాత్రమే కాకుండా, నిందితుల స్థితిగతులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. శిక్షించడానికంటే ముందు నేరస్థుల్లో పరివర్తన తీసుకురావడానికి క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ ప్రాధాన్యం ఇస్తుందని గుర్తు చేసింది.గతంలో వారిపై నేర చరిత్ర లేదని గుర్తు చేసిన హైకోర్టు.. ఇద్దర్ని హత్య చేసి దారుణమైన నేరానికి పాల్పడినప్పటికీ నేరస్థుల్లో పరివర్తన రావడానికి అవకాశం ఉందని పేర్కొంది. సమాజానికి వారు ముప్పుగా మారతారని చెప్పేందుకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఈ కేసులో తండ్రీకొడుకులతో పాటు మూడో నిందితురాలిగా ఉన్న తల్లికి దిగువ కోర్టు విధించిన జీవిత కారాగార శిక్షణు హైకోర్టు కొట్టేసి, ఆమెను నిర్దోషిగా ప్రకటించి విడుదల చేయాలని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.సురేష్ రెడ్డి, జస్టిస్ హరిహరనాథ శర్మలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.READ ALSO Tirumal శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానంటూ స్కామ్.. సస్పెండైన టీటీడీ ఉద్యోగి అరెస్టుఈ కేసు వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. కర్నూలులోని చింతలమునినగర్‌కు చెందిన నారపురం వరప్రసాద్, కృష్ణవేణి దంపతుల కుమారుడైన శ్రావణ్ కుమార్‌కు 2023
