
భారీ వర్షాలకు విజయనగరం (Vizianagaram) జిల్లా రాజాం పట్టణంలో రహదారులు జలమయం అయ్యాయి. రాజాం-చీపురుపల్లి ప్రధాన రహదారిపై, గాయత్రీ కాలనీ వద్ద వరద నీరు ప్రవహిస్తోంది. గోపినాయుడు చెరువు పొంగడంతో వీధుల్లోకి వరద చేరింది. దీంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. సంతకవిటి మండలంలోని సిరిపురం, మండవ కురీటి గ్రామాల వద్ద రెల్లిగడ్డ పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జోరు వానలకు (Rains) బొబ్బిలిలోని పలు రహదారులు జలమయమయ్యాయి. ఇందిరమ్మ కాలనీ నీట మునిగింది. రంగారాయపురం ఆనకట్ట వద్ద నాగావళి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ వీడియో చూశారా: అల్లూరి జిల్లాలో వరద బీభత్సం.. విరిగిపడ్డ కొండచరియలు