మంచు కొండల్లో స్కీయింగ్ (Skiing) చేయడం చూసే ఉంటారు. సరిగ్గా అలాగే, రెండు కర్రల (Poles) సాయంతో నేలపైన లేదా కాలిబాటల్లో నడవడాన్నే "నార్డిక్ వాకింగ్" (Nordic Walking) అంటారు. ఇది మొదటిసారిగా మంచు ప్రాంతాల్లో స్కీయింగ్ చేసే క్రీడాకారులు వేసవి కాలంలో ప్రాక్టీస్ చేయడానికి ప్రారంభించారు. అయితే, ఇప్పుడు అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక మంచి వ్యాయామంగా గుర్తింపు పొందుతోంది. ముఖ్యంగా వయసు పైబడిన వారికి ఇది చాలా ఉపయోగకరంగా మారింది.స్విట్జర్లాండ్లో ఇది చాలా ప్రసిద్ధి చెందింది. అక్కడి రైల్వే స్టేషన్లలో 70 ఏళ్లు దాటిన వృద్ధులు కూడా ఈ పోల్స్ పట్టుకుని కొండల్లో నడవడానికి ఉత్సాహంగా వెళ్తుంటారని హార్వర్డ్ అనుబంధ మాసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆరోన్ బాగిష్ తెలిపారు. హార్వర్డ్ రీసెర్చ్ ప్రకారం నార్డిక్ వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలేంటి, ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.నార్డిక్ వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువ కండరాలు పనిచేస్తాయి: సాధారణంగా నడిచినప్పుడు నడుము కింద ఉన్న కండరాలు (దాదాపు 50%) మాత్రమే పనిచేస్తాయి. కానీ నార్డిక్ పోల్స్ ఉపయోగిస్తే భుజాలు, చేతులు, ఛాతీ, పొట్ట, కాళ్ల కండరాలు కూడా యాక్టివ్ అవుతాయి. అంటే శరీరంలోని 80% నుంచి 90% కండరాలు పనిచేస్తాయి. ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి: సాధారణ నడకతో పోలిస్తే ఇందులో 18% నుంచి 67% ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కని మార్గం.ఆరోగ్యకరమైన మార్పులు శరీరంలో కొవ్వు, చెడు కొలెస్ట్రాల్ (LDL), ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరుగుతుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశ, దీర్ఘకాలిక నొప్పులు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం, కండరాల బలం, శ్వాసకోశ సామర్థ్యం, శరీర సౌలభ్యం (Flexibility) పెరుగుతాయి. శరీర సమతుల్యత (Balance): కాళ్లతో పాటు చేతుల్లో ఉన్న పోల్స్ నేలను తాకడం వల్ల నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ కోల్పోకుండా, కిందపడిపోయే ప్రమాదం తగ్గుతుంది.వాకింగ్ పోల్స్ (Poles) ప్రత్యేకత ఈ