Gold Rate Today: బంగారం కొనాలనుకుంటున్న వారికి ధరల పరుగు నుంచి స్వల్ప ఊరట లభించింది. గత రెండు రోజులు వరుసగా పెరిగిన పసిడి ధరలు ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుతో తగ్గిన పసిడి ధరలు ఆ తర్వాత భారీగా పెరిగి ఊహించని షాకిచ్చాయి. వెండి రేటు సైతం భారీగా పెరిగింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 21న హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎతెంత ఉన్నాయో తెలుసుకుందాం.