
ద క్షిణాది నుంచి ఉత్తరాది వరకు భాషలతో సంబంధం లేకుండా పలు వైవిధ్యమైన చిత్రాలలో తనదైన నటనతో సినీ ప్రియుల్ని మెప్పించింది అందాల తార రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ఇప్పుడామె దీపావళికి విడుదల కానున్న ‘రామాయణ’ చిత్రంలో శూర్పణఖగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్‌... కెరీర్‌లో ఇప్పటి వరకు భావోద్వేగాలు నిండిన ప్రేమకథలోనే నటించలేదంటూ తదుపరి చిత్రాల విషయంలో ఆసక్తి కలిగిన జానర్ల కబుర్లని పంచుకుంది. ‘‘నేను ఇప్పటి వరకు పూర్తి స్థాయి, మనసుని హత్తుకునే ప్రేమకథలో నటించలేదు. ఎమోషనల్‌ రొమాంటిక్‌ డ్రామాలో పాత్రను పోషించడం నాకు చాలా ఇష్టం. పీరియాడికల్‌ చిత్ర నేపథ్యం, హారర్‌ జానర్లలోనూ భాగం కాలేదు. నేను చేయనివి ఇంకా చాలా ఉన్నాయి. ఆ జానర్లతో కూడా విభిన్న ప్రయోగాలు చేయాలని ఉంది. ఇప్పటి వరకు నేను చేసిన పాత్రలకు భిన్నంగా.. నటిగా నన్ను సవాలు చేసుకుని మనసుకు ఉత్తేజం కలిగించే బలమైన కథలను ఎంచుకోవడమే నా ప్రాధాన్యత. ఇప్పుడా దశలో ఉన్నాన’’ని చెప్పుకొచ్చింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





