
ఈ నెల (సెప్టెంబర్) 13 నుంచి 23 వరకు చంద్రుడికి ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో కనెక్షన్ ఏర్పడబోతోంది. ఇది కొన్ని రాశులవారి జీవితాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకోవడానికి కారణమవుతుంది. ఈ నెల 13న తులా రాశిలో ఉన్న చంద్రుడికి గురువు కేంద్ర స్థితి వల్ల గజకేసరి యోగం, ఆ తర్వాత వృశ్చిక రాశిలో ఉన్న చంద్రుడి మీద గురువు పంచమ దృష్టి, ఆ తర్వాత ధనూ రాశిలో చంద్రుడికి గురువుతో పరివర్తన, చివరగా మకర రాశిలో ఉన్న చంద్రుడికి గురువు సప్తమ కేంద్ర స్థితి వల్ల గజకేసరి యోగం ఏర్పడుతున్నాయి. వీటి వల్ల మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, తుల, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం కలిగి, కోరికలు, ఆశలు తప్పకుండా నెరవేరుతాయి.





