© 2026 nimisham.in
చక్కెర ఎక్కువగా ఉండే స్వీట్స్, కేక్స్, క్యాండీలు, జెల్లీలు తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోయి గాయాలు మానడం ఆలస్యం అవుతుంది.
అందుకే ఈ షుగర్ ఫుడ్స్ తినకుండా ఉండటం మేలు.
కొంతమంది గాయాలు మానేందుకు పాలు లేదా టీలో బ్రెడ్ వేసుకుని తింటారు. కానీ వైట్ బ్రెడ్లో కార్బోహైడ్రేట్స్ షుగర్ లెవెల్స్ పెంచి గాయాలు మానడం ఆలస్యం చేస్తాయి. అందుకే గాయాలు తగ్గాలంటే వైట్ బ్రెడ్ బదులు హోల్ గ్రెయిన్ బ్రెడ్ తినడం మంచిది.
కూల్ డ్రింక్స్, సోడా, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెంచుతాయి. దీంతో గాయాలు మానడం ఆలస్యం అవుతుంది.
నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహారాలలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ఇంఫ్లమేషన్ పెంచి గాయాలు మానడం ఆలస్యం చేస్తాయి.
ప్రాసెస్ చేసిన బేకాన్, హాట్ డాగ్, సలామీ వంటివి తింటే గాయానికి రక్త ప్రసరణ సరిగా జరగదు. దీంతో గాయాలు మానడం ఆలస్యం అవుతుంది.
ఉప్పు, సోడియం ఎక్కువగా ఉండే చిప్స్ వంటి ప్యాకేజీ ఐటెమ్స్ తినడం వల్ల రక్తపోటు సమస్య ఉత్పన్నమవుతుంది. అలాగే గాయాలు మానడం కూడా ఆలస్యం అవుతుంది
టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది బాడీని డీహైడ్రేట్ చేసి గాయాలు మానడం ఆలస్యం చేస్తుంది. అందుకే గాయం మానాలంటే కెఫిన్ తక్కువగా తీసుకోవాలి.
సాస్లో సోడియం, షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి వాపును మరింత పెంచుతాయి. అందుకే గాయాలు మానాలంటే ఈ సాస్ లాంటి పదార్థాలు తినకూడదు.
ఆల్కహాల్ శరీరాన్ని డీహైడ్రేట్ చేసి రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. దీంతో గాయాలు మానడం ఆలస్యం అవుతుంది. అందుకే గాయాలు మానడం కోసం ఆల్కహాల్ తాగకపోవడమే మంచిది.