
Flax Seeds Benefits For Heart Health Cholesterol And Mind How To Eat Them
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే గుండె జబ్బులు ముప్పు పెరుగుతుంది. అవిసె గింజల్లోని ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. ఫైబర్ జీర్ణవ్యవస్థలో బైల్ యాసిడ్, కొలెస్ట్రాల్‌తో లింక్‌ను ఏర్పరుస్తుంది.
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే గుండె జబ్బులు ముప్పు పెరుగుతుంది. అవిసె గింజల్లోని ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. ఫైబర్ జీర్ణవ్యవస్థలో బైల్ యాసిడ్, కొలెస్ట్రాల్‌తో లింక్‌ను ఏర్పరుస్తుంది. పైబర్ శరీరం నుంచి కొలెస్ట్రాల్‌ను తొలగించడానికి సహాయపడుతుంది. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం, రోజూ అవిసె గింజలను తీసుకోవడం వల్ల LDL కొలెస్ట్రాల్‌ను 15% వరకు తగ్గించవచ్చు.
బీపీని కంట్రోల్లో ఉంచడానికి అవిసె గింజలు ఎంతో సహాయపడతాయి. ది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యాంజియాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, అవిసె గింజలను తీసుకోవడం వల్ల సిస్టోలిక్, డయాస్టోలిక్ బీపీ రెండూ గణనీయంగా తగ్గుతాయి. అవిశ గింజల్లో అధికంగా ఉండే ALA, లిగ్నాన్ కంటెంట్ ధమనుల పనితీరును మెరుగుపరుస్తాయి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి బీపీని కంట్రోల్లో ఉంచుతాయి.
జర్నల్ ఆఫ్ కార్డియోవాస్కులర్ ఫార్మకాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం అవిసె గింజలు, దానిలోని పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అవిసె గింజలలోని ఒమేగా-3 కంటెంట్ ధమనులలో కొవ్వు పేరుకుపోవడాన్ని, అథెరోస్క్లెరోసిస్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనివల్ల, గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అవిసె గింజలలో లిగ్నాన్స్, ఒమేగా-3లు రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి. రక్త ప్రసరణను ప్రోత్సహించి, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
అవిసెగింజల్లో లిగ్నాన్స్ అనే సహజ వృక్ష సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అవిసెగింజల్లోని ఫైబర్ కూడా కొలెస్ట్రాల్, గుండె-రక్తనాళాల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఆరోగ్యకరమైన రక్తనాళాలు మెదడుకు సరైన రక్తప్రసరణకు చాలా ముఖ్యం. అవిసె గింజలు మన డైట్లో చేర్చుకుంటే స్ట్రోక్ ముప్పు తగ్గుతుంది.
అవిసెగింజలను పొడి చేసి పెరుగు, ఓట్స్, సలాడ్లు, పప్పులు లేదా ఇతర ఆహారాల్లో కలిపి తీసుకోవచ్చు. ఎక్కువ మోతాదులో తీసుకుంటే గ్యాస్, కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు. అందువల్ల చిన్న పరిమాణంతో ప్రారంభించడం మంచిది. పచ్చి అవిసెగింజలను తినకూడదని NCCIH సూచిస్తోంది. అందుకే వీటిని తినేముందు కొంచెం వేయించి తీసుకోవడం మంచిది.
ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోండి. అలాగే వీటిని ఎంత వరకు పాటించాలనేది, విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.
రచయిత గురించికిషోర్ రెడ్డికిషోర్ రెడ్డి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2020లో సమయం తెలుగులో చేరిన కిషోర్ రెడ్డి లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన న్యూట్రిషియన్, డైట్ ప్లాన్, రోగాలు - లక్షణాలు, ఫిట్నెస్, ఇంటి చిట్కాలు, ఫ్యాషన్, హోమ్ డెకార్, రిలేషన్షిప్ వార్తలతో పాటు వివిధ ఆరోగ్య అంశాలపై ఆరోగ్య నిపుణులు, న్యూట్రిషనిస్ట్, డైటీషియన్లు, ఆయుర్వేద నిపుణులు ఇచ్చిన సలహాలు, సమాచారం ఆధారంగా విస్తృత స్థాయిలో వార్తల్ని రాశారు. అంతేకాకుండా క్లీవ్ ల్యాండ్ క్లినిక్, మాయో క్లినిక్, WHO, హార్వర్డ్ వంటి పరిశోధనలు ఆధారంగా కూడా కంటెంట్ అందించారు. ఈ సమాచారాన్ని నిజమో కాదో తెలుసుకోవడానికి నిపుణుల సలహా తీసుకోమని కూడా వివరించారు. ఈ ఆర్టికల్స్ పాఠకులకు అర్థమయ్యేలా సరళమైన భాషలో రాస్తారు.కిషోర్ రెడ్డి 2015లో సాక్షి జర్నలిజం స్కూల్లో జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం సాక్షి న్యూస్ ఛానెల్లో (20.08.2016 నుంచి 23.03.2020 వరకు) సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్, విద్య, ఉద్యోగం వార్తలు రాశారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ / జాబ్స్ సెక్షన్ చూసుకునేవారు. ఆ తర్వాత 02.04.2020 నుంచి సమయం తెలుగులో విద్య, ఉద్యోగ వార్తలతో పాటు టెక్నాలజీ న్యూస్, అడ్వర్టయిజ్‌మెంట్స్ కూడా రాశారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, ప్రముఖల ఇంటర్వ్యూలు చూడటం, కొత్త కొత్త అంశాల గురించి తెలుసుకోవడానికి ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి




