© 2026 nimisham.in

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Fisher Man Safe: విశాఖ పట్నంలో గల్లంతైన మత్స్యకారులు సురక్షితంగా ఉన్నట్టు ఏపీ మంత్రి తెలిపారు. ఒడిశా మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు వేగవంతం చేయడంతో బోటు సిబ్బందిని కాపాడగలిగారు. మెరైన్ పోలీసులు సకాలంలో స్పందించడంతోనే మత్స్యకారులు ప్రాణాలతో బయటపడినట్లు చెప్పారు. వారంతా క్షేమంగా ఉండటం హ్యాపీగా ఉందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఒడిశా ప్రభుత్వం, మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారుల వేగవంతమైన స్పందనకు ధన్యవాదాలు తెలిపారు. బాధిత మత్స్యకారులను స్వస్థలానికి చేర్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి అచ్చెన్న వెల్లడించారు. మరోవైపు విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం ఏపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సమాచారం అందిన వెంటనే కోస్ట్ గార్డ్, నేవీ, మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. ప్రతికూల వాతావరణం మధ్య సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. కాకినాడ నుంచి ప్రత్యేక నౌక, హెలికాప్టర్లను రంగంలోకి దింపి గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. మర్చంట్ షిప్ ద్వారా ఓ మత్స్యకారుడిని రక్షించామన్నారు. మిగిలిన ఆరుగురు మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోందని మంత్రి వెల్లడించారు. విశాఖ జిల్లా కలెక్టర్, ఐజీ మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డ్ అధికారులు సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. గల్లంతైన ప్రతి మత్స్యకారుడిని సురక్షితంగా తీసుకురావడమే ఏపీ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మత్స్యకారులను స్వస్థలాలకు తరలించే యత్నం
..
విశాఖ చేపల రేవు నుంచి ఈనెల 1వ తేదీన విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, అలల తాకిడికి శనివారం మధ్యాహ్నం బోటు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బోటు యజమాని కారె చిన్నయ్య ప్రాణాలతో బయటపడగా, మిగతా ఆరుగురు గల్లంతయ్యారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.