© 2026 nimisham.in

ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ మొట్టమొదటిసారిగా నిర్వహించనున్న మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Women’s Champions Trophy)కి భారత్ ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది.
మ్యాచ్‌లు క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (ముంబయి), వడోదర అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. కటాఫ్ డేట్ అయిన జులై 6 నాటికి మహిళల టీ20 ర్యాకింగ్స్లో తొలి ఆరు స్థానాల్లో ఉన్న జట్లు ఇందులో పోటీపడనున్నాయి. ఈ లెక్కన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి. ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న పాకిస్థాన్ ఈ టోర్నమెంట్‌కు దూరమైంది. టీ20 ఫార్మాట్లో మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతి జట్టు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. టాప్-2లో నిలిచిన టీమ్‌లు ఫిబ్రవరి 28న జరిగే ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
వాస్తవానికి, ఈ టోర్నీ శ్రీలంకలో జరగాల్సి ఉండగా.. శ్రీలంక క్రికెట్ బోర్డు పరిపాలన వ్యవహారాల్లో ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందన్న కారణంగా ఆతిథ్య హక్కులను కోల్పోయింది. టోర్నమెంట్ నిర్వహణకు బంగ్లాదేశ్, భారత్, దక్షిణాఫ్రికాలను ఆప్షన్లుగా పెట్టుకున్న ఐసీసీ చివరకు ప్రత్యామ్నాయ ఆతిథ్య దేశంగా భారత్‌ను సిఫార్సు చేసింది. ఈ నిర్ణయాన్ని సెప్టెంబర్ 2న ఐసీసీ బోర్డు ఆమోదించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.