© 2026 nimisham.in

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Fact Check: సోషల్ మీడియా వచ్చాక.. ఏది నిజం.. ఏది అబద్దమూ తెలియడం లేదు. ప్రపంచంలో ఏ చిన్న మూలన ఏం జరిగిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది. నిజాలతోపాటు అబద్దాలు కూడా అదే రీతిలో వైరల్ అవుతున్నాయి. అందుకే చాలా మందికి ఏ వార్త నిజం.. ఏది నిజం కాదన్న గందరగోళం ఉంటుంది. తాజాగా అలాంటి వార్తే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశంలోని మూడు అతిపెద్ద బ్యాంకులు విలీనం కాబోతున్నాయన్న వార్త జోరుగా వైరల్ అవుతోంది. ఇందులో వాస్తవం ఎంతో తెలుసుకుందాం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ .. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. కెనరా బ్యాంక్. ఈ మూడు కూడా దేశంలోని అతిపెద్ద బ్యాంకులు. SBI అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై అసలు వాస్తవం బయటకు వచ్చింది. ఇలాంటి వార్తలు నమ్మే ముందు అసలు నిజం ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. సోషల్ మీడియా వేదికలపై ప్రచారంలో ఉన్న గ్రాఫిక్ ఇమేజ్ ఒక ప్రముఖ దినపత్రిలో వచ్చినట్లుగా వార్తను పోలి ఉండే విధంగా కావాలనే క్రియేట్ చేశారని పీఐబీ నిర్ధారించింది. దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంకులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో విలీనం చేసే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా రాసి ఉంది. ఈ ప్రచారంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీన ప్రతిపాదనను కేంద్రం ఆమోదం తెలిపిందన్న ప్రచారం పూర్తి అవాస్తవమని పేర్కొంది. భారత ప్రభుత్వం
అలాంటి విలీన ప్రతిపాదనలను పరిశీలించడం లేదని.. ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఆ చిత్రం పూర్తిగా ఫేక్ అని.. ఏ అధికారిక ప్రభుత్వ కమ్యూనికేషన్ ప్రతిబింబించదు అని స్పష్టం చేసింది.
ఇలాంటి ఫేక్ గ్రాఫిక్స్ ను క్రియేట్ చేస్తూ ప్రజల్లో బ్యాంకింగ్ వ్యవస్థను భయాందోళనలు రేకెత్తించే ముఠాలపై, రూమర్స్ స్ప్రెడ్ చేసే వారిపై చట్టపరంగా కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు సైబర్ క్రైమ్ విభాగం సిద్ధంగా ఉందని సర్కార్ హెచ్చరించింది. కచ్చితమైన సమాచారం కోసం, ఎల్లప్పుడూ ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ ను చెక్ చేయాలని వెల్లడించింది. భారత ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా అనుమానాస్పద సమాచారాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్కు తెలియజేయాలని ఆ ఏజెన్సీ ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో పాటు, తన మొబైల్ నంబర్ ఇమెయిల్ చిరునామాను కూడా షేర్ చేసింది PIB.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.