
‘‘వయస్సు మళ్లిన.. ఎముకలు కుళ్లిన..’’ అంటూ మహా ప్రస్థానంలో శ్రీశ్రీ వర్ణించిన దృశ్యం ఒకప్పుడు వృద్ధాప్యానికి ప్రతీక.. కానీ ఇప్పుడు కాలం మారింది!. ఆ పరిస్థితి నేడు అరవై, డెభై ఏళ్ల వయస్సులో కాదు.. నలభై ఏళ్లకే కనిపిస్తోంది. హైదరాబాద్, (ఆంధ్రజ్యోతి): ‘‘వయస్సు మళ్లిన.. ఎముకలు కుళ్లిన..’’ అంటూ మహా ప్రస్థానంలో శ్రీశ్రీ వర్ణించిన దృశ్యం ఒకప్పుడు వృద్ధాప్యానికి ప్రతీక.. కానీ ఇప్పుడు కాలం మారింది!. ఆ పరిస్థితి నేడు అరవై, డెభై ఏళ్ల వయస్సులో కాదు.. నలభై ఏళ్లకే కనిపిస్తోంది. కండరాల బలం తగ్గిపోవడం, నడక మందగించడం, చిన్నపాటి శ్రమకే అలసట, రోజూ చేసే పనులు కూడా చేయలేక పోవడం ఇలా పలు సమస్యలకు పని ఎక్కువైంది.. నిద్ర తగ్గింది.. అంటూ కారణాలు వెతుక్కుంటూ ఉంటాం. కానీ అసలు నిజం మాత్రం ‘సార్కోపీనియా’ అనే కండరాలను కరిగించే వ్యాధి కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సార్కోపీనియా అంటే కండరాల పరిమాణం తగ్గిపోవడం, బలం, శారీరక సామర్థ్యం క్రమంగా క్షీణించడం. ఒకప్పుడు వృద్ధాప్య లక్షణంగా భావించిన ఈ కండరాల క్షీణత.. మారుతున్న జీవనశైలితో 40 ఏళ్ల వయస్సులో ఉన్న వారిపై దాడి చేస్తోంది. గంటల తరబడి కూర్చునే ఉద్యోగాలు వ్యాయామం లేకపోవడం, పోషకాహార లోపం, ఒత్తిడి పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నాయని భారత జిరియాట్రిక్ సొసైటీ హెచ్చరిస్తోంది. వయసు పెరిగే కొద్ది కండరాలు సాధారణంగానే క్షీణిస్తాయి. కానీ, ప్రారంభ దశలోనే కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. తరచూ అలసటగా అనిపించడం, మెట్లు ఎక్కడం కష్టంగా మారడం, నడక వేగం తగ్గిపోవడం, సమతుల్యత కోల్పోయి పడిపోవడం లేదా ఎముకలు విరిగే ప్రమాదాన్ని పెంచడం వల్ల జీవన నాణ్యతపై ప్రభావం చూపిస్తాయి. మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో లేకపోతే కండరాల నిర్మాణం మరింత వేగంగా దెబ్బ తింటుంది. శరీరానికి తగినంత ప్రోటీన్ అందకపోవడం, వయసు పెరిగే కొద్దీ కండరాల పెరుగుదలకు సహాయపడే హార్మోన్లు తగ్గడం వల్ల