గద్వాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉత్తమ ఉద్యోగిగా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న యువకుడు.. 24 గంటలు గడవకముందే అనుకోని రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. గద్వాల మండలం చెనుగొనిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. చెనుగొనిపల్లికి చెందిన జహంగీర్ భాషా అనే 28 ఏళ్ల యువకుడు 108 అంబులెన్సులో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఉత్తమ పనితీరు కనబరచటంతో ఆగస్ట్ 15వ తేదీ జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగిగా జహంగీర్ భాషా అవార్డు అందుకున్నారు. అయితే అవార్డు అందుకుని 24 గంటలు కూడా గడవకముందేగుండెపోటుతో జహంగీర్ భాషా చనిపోయాడు. చేతికి అందివచ్చిన తనయుడు అనుకోకుండా చనిపోవటంతో.. జహంగీర్ భాషా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అతని కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని 108 సిబ్బంది కోరుతున్నారు.రోడ్డు ప్రమాదం.. నిండు ప్రాణం బలి..రోడ్డు ప్రమాదంలో ఓ నిండు ప్రాణం పోయింది. ఈ ఘటన దామరగిద్ద మండలంలో చోటుచేసుకుంది. గడిమున్పల్లి సమీపంలో శనివారం రోజు తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు, గ్రామస్థులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉశంతమ్మ అనే 55 ఏళ్ల మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ సమయంలో ఓ సిమెంట్ బస్తా లారీ రోడ్డుపై వస్తోంది. ఈ సిమెంట్ లారీ మహిళను ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో మహిళ మృతదేహం రెండు భాగాలుగా విడిపోయింది. ప్రమాదం అనంతరం డ్రైవర్ వాహనంతో సహా ఘటనాస్థలి నుంచి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ప్రమాదానికి కారణమైన లారీని నారాయణపేటలో కొంతమంది గుర్తించారు.మరోవైపు మహిళ కుటుంబానికి న్యాయం చేయాలంటూ స్థానికులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో రాజకీయ నేతలు అక్కడకు చేరుకుని వారికి సర్దిచెప్పారు. లారీ యజమానితో మహిళ కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వ పరంగా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వటంతో స్థానికులు నిరసన విరమించారు. అనంతరం