
ఇంటర్నెట్‌డెస్క్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Tesla CEO Elon Musk) 2025 జులై నుంచి 2026 జులై మధ్య రోజుకు రూ.8300కోట్లు సంపాదించినట్లు బెస్ట్‌బ్రోకర్స్ అధ్యయనం వెల్లడించింది. ఈ కాలంలో ఆయన సంపద 320 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.30లక్షల కోట్లు) మేర పెరిగింది. 2026 జూన్ 12వ తేదీన స్పేస్ఎక్స్ స్టాక్మార్కెట్లోకి అడుగు పెట్టినప్పుడు ఆ కంపెనీ అధిపతి మస్క్ ప్రపంచానికి తొలి ట్రిలియనీర్ (లక్ష కోట్ల డాలర్లు/సుమారు రూ.95 లక్షల కోట్లకు పైగా సంపద కలిగిన వ్యక్తి)గా అవతరించారు. అయితే గత నెలలో ఆ సంస్థ షేర్లు కుప్పకూలడంతో ఆయన ట్రిలియనీర్ స్థానాన్ని కోల్పోయారు. అయినప్పటికీ ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. గత సంవత్సరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), టెక్నాలజీలో వేగవంతమైన వృద్ధి కనిపించింది. దీంతో మస్క్ సహా మైఖేల్ డెల్, లారీ పేజ్, సెర్గీ బ్రిన్ గియాన్‌కార్లో వంటి టెక్ పారిశ్రామికవేత్తల సంపద భారీగా పెరిగింది. మస్క్ తర్వాత సంపద వేగంగా పెరిగిన పారిశ్రామిక వేత్తల్లో డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, సీఈఓ మైఖేల్ డెల్ ఉన్నారు. 2025 జులై నుంచి 2026 జులై మధ్య ఆయన సంపద 107.6 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. ఏఐ ప్రభంజనం కారణంగా డీప్‌సీక్ వ్యవస్థాపకుడు లియాంగ్ వెన్ఫెంగ్ సంపద కూడా 39.5 బిలియన్ డాలర్ల మేర పెరగడంతో ప్రపంచంలోని టాప్ 50 అత్యంత ధనవంతులలో ఒకరిగా నిలిచారు. ఇదీ చదవండి: దిగుమతి సుంకం పెంపు.. బంగారం, వెండితో ₹10వేల కోట్లు గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ