
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు ముగిశాయి. సీబీఐ కేసు ఆధారంగా హైదరాబాద్, కడప సహా ఏడు చోట్ల ఈడీ తనిఖీలు చేపట్టింది. ఈ కేసులోని కీలక నిందితుల నివాసాల్లో సోదాలు జరిగాయి. పలు పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి నివాసాల్లోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. అవినాష్ నివాసంలో లెక్క చూపని రూ.24లక్షల నగదును సీజ్ చేశారు. ఆయనకు చెందిన రెండు లాకర్ల తాళాలను స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో లభించిన డిజిటల్, ఆర్థిక ఆధారాలపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. చెరువులు, కుంటల్లో సహజసిద్ధంగా పెరిగే తామర పూలను ఓ రైతు వరికి ప్రత్యామ్నాయంగా పొలంలో సాగు చేస్తున్నారు. శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా అనకాపల్లిలో నూకాలమ్మ.. ధనలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. విజయవాడ దుర్గగుడికి దశాబ్దం తర్వాత.. అన్నదానం, ప్రసాదం తయారీకి ప్రత్యేక భవనాలు అందుబాటులోకి వచ్చాయి. శ్రావణ మాసం శుక్రవారం, వరలక్ష్మీ వత్రం పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ శోభ సంతరించుకుంది. జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో అమ్మవారిని కూరగాయలు, కరెన్సీ నోట్లు, పసుపు కొమ్ములతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయాలకు అధిక సంఖ్యలో తరలిరావడంతో రద్దీ నెలకొంది. మరోవైపు మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారు. ఆ ఫొటోలు మీకోసం