
ఆఫీస్‌లో ముఖ్యమైన పనులను ముందుగా పూర్తి చేయండి. డెడ్‌లైన్‌కు దగ్గర్లో ఉన్న టాస్క్‌లు పూర్తి చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
ఆఫీస్‌లో పని చేస్తున్నప్పుడు విరామాలు తీసుకోండి. ప్రతి అరగంటకు 5 నిమిషాలు విరామాలు తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
ఆఫీస్ పనిలో మీకు ఒత్తిడిగా అనిపించినప్పుడు డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్డ్రీత్ తీసుకుంటే మనసు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి మాయం అవుతుంది.
ఆఫీస్‌లో ఒక సమయంలో ఒక పనిని మాత్రమే చేయండి. ఒకే సారి రెండు లేదా మూడు పనులు చేయడానికి ప్రయత్నించవద్దు. మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల ఒత్తిడి తీవ్రం అవుతుంది.
ఆఫీస్ పని విషయంలో హద్దులు పెట్టుకోండి. మీ పనిని మాత్రమే మీరు చేయండి. మీవి కాని పనులు మీకు అప్పగిస్తే నో చెప్పండి. దీంతో ఒత్తిడి తగ్గతుంది.
కాఫీ ఎక్కువగా తాగడం వల్ల ఆందోళన వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి కాఫీని మితంగా తాగండి.
మీ పని చేసే ప్రాంతాన్ని చక్కగా ఉంచుకోండి. డెస్క్‌ను క్లియర్‌గా సర్దుకోండి. దీంతో ఒత్తిడి తగ్గుతుంది.
పని చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ప్రశాంతమైన మ్యూజిక్ వినండి. దీని వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
ఆఫీస్‌లో కొలీగ్స్‌తో మాట్లాడండి. సరదాగా మాట్లాడితే ఆఫీస్ ఒత్తిడి తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది.




