
గ్రీన్ టీలో కెఫీన్, ఎల్-థియనిన్ అని పిలిచే అమైనో యాసిడ్లు ఉంటాయి. ఈ రెండూ కలిసి ఏకాగ్రతను పెంచి మానసిక స్థితిని స్థిరంగా ఉంచుతాయి. గ్రీన్ టీలో కాటెచిన్స్ ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచి పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటాయి. గ్రీన్ టీని రోజూ తాగితే రక్తనాళాల పనితీరు చక్కగా ఉంటుంది. అలాగే, శరీరానికి హాని చేసే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. గ్రీన్ టీలో ఉండే EGCG వంటి సమ్మేళనాలు మెదడుకు రక్షణ కల్పిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. గ్రీన్ టీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. గ్రీన్ రోజూ 2 కప్పుల నెల రోజుల పాటూ తాగి చూడండి. ఇది జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. అమ్మాయిలు గ్రీన్ టీ తాగితే మొటిమలు చాలా వరకు తగ్గిపోతాయి. వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా అడ్డుకుంటుంది. Gold Rings: ఒక గ్రాములో లభించే క్యూట్ రింగ్స్.. డైలీవేర్ కి బాగుంటాయి Chapati: గ్యాస్ పై నేరుగా చపాతీ కాల్చుతుంటే..ఇది తెలుసుకోండి ఫస్ట్ Gold Necklace: పది గ్రాముల బంగారంలో అదిరిపోయే స్టోన్ నక్లెస్ డిజైన్లు Pregnancy Diet: ప్రెగ్నెన్సీ టైంలో ఈ పండ్లు తింటే ఎంత మంచిదో!