
విమానంలో ప్రయాణికులకు కావాల్సిన అవసరాలు చూస్తూ, వారి భద్రతను చూసే క్యాబిన్ క్రూ ఉద్యోగం ఎయిర్ హోస్టెస్. దీనికి అమ్మాయిల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ ఉద్యోగంలో మంచి జీతంతో పాటు దేశ, విదేశాల్లో ప్రయాణించే అవకాశం కూడా వస్తుంది కాబట్టి ఎక్కువ మంది అమ్మాయిలు దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇండియాలో క్యాబిన్ క్రూ ఉద్యోగులకు సాధారణంగా నెలకు రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు జీతం ఉంటుంది. ఇది కేవలం ప్రారంభ జీతం. అంటే ఫ్రెషర్లకు ఇస్తారు. ఫ్లయింగ్ గంటలు, అలవెన్సులు కలిపితే ఆదాయం మరింత ఎక్కువగా ఉంటుంది. Skytech Aviation చెబుతున్న వివరాల ప్రకారం, ఇండిగో సంస్థలో ఒక ఎయిర్ హోస్టెస్ ప్రారంభ జీతం నెలకు సుమారు రూ.30 వేల నుంచి రూ.47 వేల వరకు ఉంటుంది. అదే ఎయిర్ ఇండియాలో రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు, స్పైస్‌జెట్‌లో రూ.31 వేల నుంచి రూ.45 వేల వరకు ఉంటుంది. వీరి అనుభవం పెరిగే కొద్దీ జీతం కూడా పెరుగుతుంది. మిడ్ లెవల్లో రూ.55 వేల నుంచి రూ.75 వేల వరకు అందుకుంటారు. అలాగే సీనియర్ స్థాయిలో రూ.75 వేల నుంచి రూ.లక్షకు పైగా సంపాదించే అవకాశం ఉంటుంది. సూపర్వైజర్ లేదా ఇన్‌ఫ్లైట్ మేనేజర్ స్థాయికి చేరితే నెలకు రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షల వరకు ఉండొచ్చు. ఎయిర్ హోస్టెస్ ఉద్యోగులకు కేవలం జీతమే కాదు అదనపు సౌకర్యాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా విమాన ప్రయాణాల సమయంలో ఫ్లయింగ్ అలవెన్స్, లేఓవర్ సమయంలో రోజువారీ భత్యం వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఇవన్నీ కలుపుకుంటే నెలకు చేతికొచ్చే డబ్బు అధికంగా ఉంటుంది. ఇక విదేశాలకు వెళ్లే విమానాల్లో పనిచేసే సిబ్బందికి హోటల్ వసతి, రవాణా వంటివి అంతా ఉచితే. కొన్ని ఎయిర్‌లైన్ సంస్థలు ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా లేదా తక్కువ ధరకు విమాన టికెట్లు ఇస్తాయి. అలాగే