
Do You Know How Much Nursery School Fees Are In America You Can Buy Two Cars With That Fee Aagfbrd
అమెరికా అంటే ఎంతోమంది కల. అక్కడకు జీవితాన్ని ఎంజాయ్ చేయాలని, బాగా సంపాదించుకోవాలని అనుకుంటారు. అయితే అక్కడ సంపాదన ఎక్కువగా ఉన్నట్టే ఖర్చులు కూడా అధికమే. సోనాల్ చౌదరి అనే మహిళ తన కూతురిని నర్సరీలో వేసేందుకు తీసుకెళ్లింది.
అమెరికా అంటే ఎంతోమంది కల. అక్కడకు జీవితాన్ని ఎంజాయ్ చేయాలని, బాగా సంపాదించుకోవాలని అనుకుంటారు. అయితే అక్కడ సంపాదన ఎక్కువగా ఉన్నట్టే ఖర్చులు కూడా అధికమే. సోనాల్ చౌదరి అనే మహిళ తన కూతురిని నర్సరీలో వేసేందుకు తీసుకెళ్లింది. అక్కడ ఫీజు చూసి షాక్ అయిపోయింది.ఆ వివరాలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.
ఇండియాలో ఉన్నట్టు 20, 30 మంది పిల్లలకు ఒక టీచర్ కాకుండా.. అక్కడ ప్రతి 8 మంది పిల్లలకు ఇద్దరు టీచర్లు ఉంటారు. పాటలు, ఆటలు, యోగా, డ్రాయింగ్ వంటి కార్యకలాపాలతో పిల్లలకు విసుగు రాకుండా చూసుకుంటారు. ఈ ప్రీస్కూల్ రోజుకు కేవలం మూడు గంటలు మాత్రమే నడుస్తుంది. వారానికి పిల్లలను ఎన్ని రోజులు పంపిస్తారు అనే దానిపై ఆధారపడి ఫీజును లెక్కిస్తారు.
పిల్లలను వారానికి అయిదు రోజుల పాటూ నర్సరీ స్కూలుకు పంపిస్తే ఏడాదికి సుమారు 9.3 లక్షల రూపాయలు చెల్లించాలి. అంటే మనదేశంలో ఆల్టో వంటి చిన్న కారులు ఈ ధరకు రెండు కొనేసుకోవచ్చు. అలా కాకుండా మూడు రోజులే స్కూలుకు పంపిస్తే ఆ ధర సగానికి తగ్గుతుంది. కానీ వారానికి అయిదు రోజులు పంపిస్తేనే పిల్లలక ఉపయోగకరంగా ఉంటుంది.




