
ప్రతి ఇంట్లో టోమోటోలు ఉంటాయి. అవి లేనిదే ఏ కూర పూర్తి కాదు. ఇగురు, పులుసు ఎక్కువ కావాలంటే వెంటనే టమోటాలను ముక్కలు కోసి వేసేస్తూ ఉంటారు. రోజూ వండే వంట్లో టొమాటో కచ్చితంగా ఉండాల్సిందే. కూరల నుంచి సలాడ్స్, చట్నీలు, శాండ్విచ్ల వరకు టొమాటో వాడతాం. ఇది ఫుడ్ టేస్ట్‌ను పెంచుతుంది. కానీ మార్కెట్ నుంచి తెచ్చిన ఎర్రటి టొమాటోలు కొద్ది రోజులకే మెత్తబడి కుళ్లిపోతుంటాయి. వాటిపై నల్ల మచ్చలు వస్తాయి. ఇలా జరగకుండా అవి నెల రోజులూ పాటూ తాజాగా ఉండాలంటే కొన్ని తప్పులు చేయకూడదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. టొమాటోలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే, వాటిని తొడిమ ఉన్న భాగం కిందకు పెట్టి నిల్వ చేయాలి. గుండ్రంగా ఉండే భాగం పైకి ఉండాలి. ఇలా చేయడం వల్ల టొమాటోలో ఉండే తేమ బయటకు పోదు. ఫలితంగా అవి తాజాగా ఉంటాయి. ఒకవేళ టొమాటోలకు తొడిమ లేకపోతే, ఆ ప్రదేశంలో టేప్ అంటించండి. తొడిమ ఉండే భాగం చాలా సున్నితంగా ఉంటుంది. దాన్ని తెరిచి ఉంచితే, తేమ త్వరగా ఆవిరైపోయి టొమాటో ముడతలు పడి మెత్తగా అవుతుంది. కొన్ని రోజుల పాటు టొమాటోలను వాడకపోతే, ఈ సింపుల్ చిట్కా బాగా పనిచేస్తుంది. చాలామంది టొమాటోలు కొనగానే ఫ్రిజ్‌లో పెట్టేస్తారు. కానీ అలా చేయకూడదు. ఫ్రిజ్‌లోని చల్లటి ఉష్ణోగ్రత టొమాటో రుచిని, రూపాన్ని దెబ్బతీస్తుంది. దీనివల్ల టొమాటోలు మెత్తగా అయిపోతాయి. కొంచెం పచ్చిగా లేదా దోరగా ఉన్న టొమాటోలను వంటగదిలో చల్లని ప్రదేశంలో ఉంచడం మంచిది. కొన్న తర్వాత టొమాటోలను ఒకదానిపై ఒకటి గుట్టగా పోయకూడదు. అలా చేయడం వల్ల పైవాటి బరువుకు కింద ఉన్న టొమాటోలు నలిగిపోయి, త్వరగా కుళ్లిపోతాయి. కాబట్టి, వాటిని ఒక బుట్టలో వేయకుండా, వెడల్పాటి ప్లేటులో దూరదూరంగా పరచి పెట్టడం ఉత్తమం. అరటిపండ్లు, యాపిల్స్, జామపండ్ల వంటి పండ్లతో కలిపి టొమాటోలను ఉంచకూడదు. ఎందుకంటే ఈ