. ఇతర పనులకు నాకు టైం ఉండదు. ప్రతీ రోజూ ఏదో ఒకటి కొత్తగా క్రియేట్ చేయాలని ఆలోచిస్తుంటాను.
సోషల్ మీడియాలో వచ్చే ప్రశంసలు, విమర్శల్ని ఎలా తీసుకుంటారు? సోషల్ మీడియాలో అన్నీ ఉంటాయి. ప్రతీ వీడియోకి కొన్ని కొత్త ప్రశంసలు, కొన్ని తిట్లు వస్తుంటాయి. ఈ కంటెంట్ క్రియేషన్ అనే దాన్ని నేను ఒక బ్రిడ్జ్‌లా వాడతాను. ఇక్కడ నా కోసం ఉండే ఫాలోయింగ్‌ని సినిమా థియేటర్ వరకు తీసుకు రావాలని అనుకుంటున్నాను. అయితే కంటెంట్ క్రియేషన్స్‌లోనే మా రోజువారి ఖర్చులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ ఫ్లూయెన్సర్, కంటెంట్ క్రియేటర్ అనే మాట కంటే.. నటుడు అని పిలిపించుకోవాలని నాకు ఉంటుంది.
సోషల్ మీడియా లైఫ్, ఈ క్రియేటర్ స్పేస్ గురించి కొత్తగా వచ్చేవాళ్లకు మీరు ఇచ్చే సలహా ఏంటి? కొద్దిగా ఫాలోవర్లు లైకులు షేర్లు కనిపించాయంటే చాలు, చూసే జనాలంతా అబ్బా ‘లైఫ్ అంటే వీడిది రా’ అనుకుంటారు. కానీ అది నిజం కాదు, వైకుంఠపాళీ లాగా నిచ్చెనెక్కిచ్చేది అదే, ఏదైనా తేడా కొడితే క్రింద పడేసేది అదే. చూడటానికి అందంగా ఫ్యాన్సీగా కనిపిస్తుంది, వ్యూస్ & రీచ్ కోసం ఒకటి చెప్తే ఇంకో టైటిల్ పెట్టి, తంబ్‌నెయిల్ మార్ఫ్ చేసి వాళ్ళ ప్రయోజనాల కోసం జీవితాలు నాశనం చేసే వాళ్ళూ ఉన్నారు. సో దీంట్లోకి రావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ప్రశంసకీ విమర్శకీ రెండింటికి సిద్ధంగా ఉండాలి. అలా అయితేనే ఈ స్పేస్‌లో సర్వైవ్ అవ్వగలరు.
అరవింద్ పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మిమ్మల్ని విమర్శించే వారు కూడా పొగిడేస్తున్నారు కదా? కంటెంట్ క్రియేషన్స్‌లో ఒకే రకమైన పాత్రను పోషించగలను. కానీ సిరీస్, సినిమా వరకు వచ్చే సరికి రకరకాల పాత్రలను పోషించే అవకాశం వస్తుంది. నేను ‘దందా’లో అరవింద్‌గా మాత్రమే కనిపిస్తాను. ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రలే రావాలని ఇన్నాళ్లు కోరుకున్నాను. ఇదంతా మా దర్శకుడి వల్లే సాధ్యమైంది.
దర్శకుడు ఆదిత్య దేవులపల్లి మీ గురించి ఎంతో గొప్పగా చెప్పారు?.. మీరు నిజంగానే సింగిల్ టేక్ ఆర్టిస్టా? నాకు మానిటర్ చూసే అలవాటు ఉండదు. కెమెరామెన్‌ని చూస్తేనే విషయం తెలుస్తుంది. ఫస్ట్ టేక్‌లోనే సీన్‌ను పూర్తి చేయాలని అనుకుంటాను. అందుకే ఒక సీన్ ఉంటే.. దానికి ముందు, తర్వాత సీన్లు ఏంటన్నది కూడా చూసుకుంటాను. అందుకే దాదాపు అన్నీ కూడా సింగిల్ టేక్‌లోనే చేసేస్తాను. టేక్స్ ఎక్కువ అయితే ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరుగుతుంది. సెట్లో ఉన్నంత సేపు నేను అరవింద్ పాత్రలోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. అందుకే సింగిల్ టేక్‌లోనే చేసేశాను.
ప్రస్తుతం ఉన్న మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి మీ అభిప్రాయం ఏంటి? కంటెంట్ ఎంత బాగున్నా.. మన దగ్గర ఉన్న కంటెంట్ గురించి జనాలకు చెప్పే మార్కెటింగ్ స్ట్రాటజీ లేకపోతే వృథానే. అందుకే ఇప్పుడు ప్రమోషన్స్, మార్కెటింగ్ అనేది ఎంతో ముఖ్యంగా మారాయి. ‘దందా’ కోసం నేను కూడా డిఫరెంట్‌గా ప్రమోట్ చేయాలని అనుకున్నాను. అందుకే నా రూ. 15 లక్షలు పోయాయి అని మా సిరీస్ కంటెంట్ అర్థమయ్యేలా ఓ ప్రమోషనల్ వీడియో చేశాం. అది అర్థమైంది కాబట్టి.. మా ‘దందా’ని ఆడియెన్స్ బిగ్గెస్ట్ హిట్ చేశారు.
సోషల్ మీడియాలో మీకోసం నిలబడే మీ ఫ్యాన్స్ గురించి చెప్పండి? ఇదంతా ఒక్క రోజులో సంపాదించింది కాదు. నేను చేసిన కంటెంట్‌లో వాళ్లని వాళ్లు చూసుకున్నారు. అలా చూసుకుని కనెక్ట్ అయ్యారు. ఇదంతా జరగడానికి కొన్ని ఏళ్లు పడుతుంది. సోషల్ మీడియాలో పాజిటివిటీతో పాటుగా నెగెటివిటీ ఉంటుంది. మాట్లాడేవాళ్లు మాట్లాడుతూనే ఉంటారు. నిజం ఏంటన్నది నాకు తెలుసు. అందుకే నేను ఏమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటాను.
సోషల్ ఇన్‌ఫ్లూయన్సర్ మీఁద ఎలాంటి బాధ్యత ఉంటుంది? మొన్న కామన్ వెల్త్ గేమ్స్‌లో సాక్షీ చౌదరీ బాక్సింగ్ కేటగిరిలో గోల్డ్ మెడల్ కొట్టేరు, అది ఎంతమందికి తెలుసు? కానీ మీరు ఫాలో అయ్యే ఇన్‌ఫ్లూయన్సర్ ఏం పోస్టు పెట్టేరు ఏం ట్వీట్ చేశారు అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుంటది. సో సెలబ్రిటీస్, స్పోర్ట్స్‌మేన్ కంటే ఎక్కువ జనాలు ఇన్ఫ్లూయన్సర్స్ని అడ్మైర్ చేస్తారు, వాళ్ళ లుక్స్ అండ్ స్టైల్‌ని బాగా గమనిస్తారు. కాఁబట్టి ఇన్‌ఫ్లూయన్సర్ ఏం చేసినా, మాట్లాడినా, బట్టలు వేసుకున్నా సరే అది చాలామంది పై ప్రభావం చూపిస్తుంది. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి
ఖాళీ టైంలో దొర సాయి తేజ ఎలా ఉంటాడు? నేను కూడా అందరిలో ఒకడినే. కాకపోతే నాకంటూ ఓ దారి క్రియేట్ చేసుకున్నాను. అది నా ఆర్థిక పరిస్థితుల వల్ల కావొచ్చు, చిన్నప్పటి నుంచి నాకున్న ప్యాషన్ వల్ల కావొచ్చు. ఇక ముందు నన్ను అందరూ కొత్తగా చూస్తారు. థియేటర్, ఓటీటీ, సోషల్ మీడియాలో నన్ను చూసి అందరూ గర్వపడేలా చేస్తాను. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా సరే ఆగకుండా పరిగెత్తాలి, నా లక్ష్యాన్ని సాధించాలనే ఫోకస్‌తోనే ఉంటాను.
‘దందా’ టీం గురించి చెప్పండి? ఆదిత్య గారు వంద శాతం సక్సెస్ అయ్యారు. పేపర్ మీద రాసుకున్నది అవుట్ పుట్‌గా తీసుకు రావడం అన్నది మామూలు విషయం కాదు. ఆ విషయంలో ఆదిత్య అన్నకు ప్రశంసలు వస్తున్నాయి. ‘దందా’ సిరీస్‌కు సంబంధించిన ప్రతీ విషయంలో ఆయన ఎంతో కష్టపడ్డారు. ఆయన విజన్ వల్లే ‘దందా’ యూనిక్‌గా నిలిచింది. ఈ సిరీస్‌ను ఏడు రోజుల్లో, 30 కాల్షీట్స్లో పూర్తి చేశాం. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా కష్టపడి పని చేశాం. అదే ‘దందా’కి హైలెట్. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, మేం ఇలా అందరం సింక్‌లో ఉన్నాం. అందుకే ‘దందా’ అద్భుతంగా వచ్చింది.
ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? ప్రతీ ఒక్క సాధారణ వ్యక్తి రిలేట్ అయ్యే కథల్ని థియేటర్లో చూపించాలని అనుకుంటున్నాను. జీరో టు హీరో అనే పాత్రలను పోషించాలని కోరుకుంటున్నాను. అందరిలోనూ స్పూర్తి నింపే కథల్ని, మంచి సందేశాన్ని ఇచ్చే ప్రాజెక్ట్‌ల్ని చేయాలని అనుకుంటున్నాను. మన చుట్టూ ఉండే కథల్ని, పాత్రల్ని ఎంచుకుంటాను. ప్రేక్షకులు నా కోసం ఖర్చు పెట్టే డబ్బులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో పని చేస్తాను.”