
ప్రేక్షకులు నా కోసం ఖర్చు పెట్టే డబ్బులకున్యాయం చేయాలనే లక్ష్యంతో పని చేస్తాను - దందా’ ఫేమ్
వర్టికల్ స్టోరీస్‌లో చాయ్ షాట్స్ నుంచి వచ్చిన ‘దందా’ సిరీస్‌తో హీరోగా దొర సాయి తేజ ఓ ట్రెండ్ క్రియేట్ చేశారు. దర్శకుడు ఆదిత్య దేవులపల్లి తెరకెక్కించిన ఈ సిరీస్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సిరీస్ సక్సెస్ ఫుల్‌గా సాగుతున్న తరుణంలో హీరో దొరసాయి తేజ తన జర్నీ గురించి కొన్ని విశేషాల్ని పంచుకున్నారు. ఆయన చెప్పిన సంగతులేంటో ఓ సారి చూద్దాం. మీ సినీ జర్నీ గురించి చెప్పండి? ప్రభాస్ గారి ‘అడవి రాముడు’ సినిమాలో హీరో చిన్నప్పటి చైల్డ్ కారెక్టర్‌కి డబ్బింగ్ చెప్పాను. ‘కొత్తబంగారులోకం’, ‘హై స్కూల్’ అనే సిరీస్‌లో నటించాను. ‘అలా మొదలైంది’ సినిమాలోనూ ఓ చిన్న పాత్రను పోషించాను. 2016 నుంచి ఆర్జీవీ గారి అనుబంధం ఏర్పడింది. ‘శ్రీదేవీ’ అనే ఓ విడుదల కాని సినిమాలో నటించాను. అక్కడే నాకు సినిమా పరిచయమైంది. అలా 2018లో యూట్యూబ్ జర్నీ సీరియస్‌గా ప్రారంభమైంది. ‘బ్యాక్ బెంచర్స్’ సిరీస్‌తో మంచి గుర్తింపు వచ్చింది. అలా సిరీస్‌లు చేసుకుంటూ వచ్చాను. గత ఏడాది సొంతంగా కంటెంట్ క్రియేషన్ కంపెనీ ప్రారంభించాను. రీసెంట్గా మళ్లీ ‘దందా’తో సక్సెస్ వచ్చింది. ఇంత చిన్న వయసులోనే వ్యాపారస్థుడిగా, నటుడిగా, కంటెంట్ క్రియేటర్‌గా సాధించడం ఎలా అనిపిస్తుంది? నేను నిద్ర లేచిన క్షణం నుంచి ఒక కంటెంట్ క్రియేటర్‌గా, డైరెక్టర్‌గా, యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా ఆలోచిస్తూనే ఉంటాను. నన్ను నేను కొత్తగా పరిచయం చేసుకోడానికి ఇదొక మార్గం. అందుకే అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాను. కంటెంట్ క్రియేషన్ అనేది నా బిజినెస్. సినిమా అనేది నా ప్యాషన్. రెండూ కలిపితే దొర సాయి తేజ. మీకు పార్టీలు చేసుకోవాలని, ఎంజాయ్ చేయాలని అనిపించదా? ప్రతీ విషయాన్ని నేనే నేర్చుకోవాలి. నాకు నేనుగానే అన్నీ నేర్చుకుంటాను. పడిపోయినప్పుడు ఓ కొత్త గుణపాఠం నేర్చుకుంటాను. నేను ఎప్పుడూ నా వయసు కంటే ఓ ఐదేళ్లు పెద్దవాడిలానే ఆలోచిస్తా. రోజంతా నాకు పనులే ఉంటాయి