© 2026 nimisham.in

పశ్చిమ- మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఒడిశా తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. మరింత విస్తరిస్తోంది. దీని ప్రభావంతో అక్కడక్క నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని, తీర ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.తాజా సమాచారం ప్రకారం.. ఈ వాయుగుండం ప్రస్తుతం బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్లోని బాంకురాకు 132, ఒడిశాలోని బాలేశ్వర్కు 1590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా భూభాగం వైపు ప్రయాణించే కొద్దీ ఆయా రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చు. దీని ప్రభావం ఉత్తరాంధ్ర సరిహద్దు జిల్లాలపై స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర తీరంలో వాతావరణం వేగంగా మారుతోంది.ఈ మార్పుల వల్ల రానున్న రెండు రోజుల పాటు ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు ఉత్తరాంధ్ర జిల్లాల తీరం వెంబడి గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. సముద్రం అలజడికి గురయ్యే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలో వేటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.భారత్ ను చూసి నేర్చుకోండి- అర్జంట్ గా ఆ బిల్లు తీసుకురండిశ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ ఓ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షపాతం నమోదు కావొచ్చు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల వద్ద గానీ ఆశ్రయం పొందవద్దని పేర్కొంది.తిరుమలలో శరవేగంగా.. : టీటీడీ తక్షణ ఆదేశాలు జారీ
పశ్చిమ- మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఒడిశా తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. మరింత విస్తరిస్తోంది. దీని ప్రభావంతో అక్కడక్క నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని, తీర ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.తాజా సమాచారం ప్రకారం.. ఈ వాయుగుండం ప్రస్తుతం బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్‌లోని బాంకురాకు 132, ఒడిశాలోని బాలేశ్వర్‌కు 1590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా భూభాగం వైపు ప్రయాణించే కొద్దీ ఆయా రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చు. దీని ప్రభావం ఉత్తరాంధ్ర సరిహద్దు జిల్లాలపై స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర తీరంలో వాతావరణం వేగంగా మారుతోంది.ఈ మార్పుల వల్ల రానున్న రెండు రోజుల పాటు ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు ఉత్తరాంధ్ర జిల్లాల తీరం వెంబడి గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. సముద్రం అలజడికి గురయ్యే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలో వేటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.భారత్ ను చూసి నేర్చుకోండి- అర్జంట్ గా ఆ బిల్లు తీసుకురండిశ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ ఓ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షపాతం నమోదు కావొచ్చు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల వద్ద గానీ ఆశ్రయం పొందవద్దని పేర్కొంది.తిరుమలలో శరవేగంగా.. : టీటీడీ తక్షణ ఆదేశాలు జారీ