© 2026 nimisham.in

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Continental Hospitals:కాంటినెంటల్ వాయిస్ అండ్ పర్ఫార్మెన్స్ క్లినిక్‌ను జూలై 12న ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, పద్మభూషణ్ ఎం.ఎం. కీరవాణి ప్రారంభించారు. కార్యక్రమంలో కాంటినెంటల్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ గురు ఎన్. రెడ్డి పాల్గొన్నారు. అలాగే పద్మశ్రీ శోభారాజు ముఖ్య అతిథిగా హాజరై తన గానంతో ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ, గాయకులుగా లేదా స్వరం కీలకమైన ఏ వృత్తిలోనైనా విజయాన్ని సాధించాలంటే సరైన మార్గదర్శకత్వంలో వాయిస్ ట్రైనింగ్ ఎంతో అవసరమని చెప్పారు. స్వర సంరక్షణ కోసం ఇలాంటి ప్రత్యేక వాయిస్ సెంటర్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. శాస్త్రం, కళ కలయికగా ఈ కేంద్రం నిలుస్తుందని అభినందించారు. డాక్టర్ గురు ఎన్. రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ మంది మాత్రమే తమ స్వరాన్ని మెరుగుపరచుకునేందుకు ప్రొఫెషనల్ వాయిస్ లేదా స్పీచ్ కోచింగ్ తీసుకుంటున్నారని అన్నారు. గానం అనేది సాధనతో అభివృద్ధి చేసుకునే నైపుణ్యమని, జన్యుపరమైన అంశాలు స్వరాన్ని ప్రభావితం చేసినప్పటికీ ఒక వ్యక్తి ప్రతిభకు అవే పరిమితి కాదని వివరించారు. భారతదేశంలో బ్రెయిన్ స్ట్రోక్ నుంచి కోలుకున్న వారిలో కేవలం రెండు శాతం మందికే స్పీచ్ థెరపీ అందుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో మాత్రం 70 నుంచి 80 శాతం మంది రోగులు స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజీతో కూడిన న్యూరో రీహాబిలిటేషన్ సేవలు పొందుతున్నారని తెలిపారు. కాంటినెంటల్‌లోని విటానోవా రీహాబిలిటేషన్ సెంటర్లో ఈ సేవలు అందుబాటులో
ఉన్నాయని చెప్పారు.
ఈ వాయిస్ క్లినిక్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన లారింజాలజిస్టులు, ఫోనోసర్జన్లు, స్పీచ్ పాథాలజిస్టులు సేవలు అందిస్తారు. అత్యాధునిక నిర్ధారణ పరికరాలు, లేజర్ థెరపీ, వాయిస్ రీహాబిలిటేషన్ వంటి చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి. వృత్తిపరంగా స్వరాన్ని వినియోగించే వారికి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్స అందించి, వారి స్వర ఆరోగ్యాన్ని కాపాడడమే లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేయనుంది.
ప్రారంభోత్సవం అనంతరం 70 మందికి పైగా ఔత్సాహిక గాయకులు, ఇతర వృత్తిపరుల కోసం ప్రత్యేక వాయిస్ వర్క్‌షాప్ నిర్వహించారు. డాక్టర్ దుష్యంత్ గణేసుని, డాక్టర్ రేష్మి అన్నా అలెక్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వరం ఎలా ఉత్పత్తి అవుతుంది, వోకల్ మాడ్యులేషన్, వాయిస్ హైజీన్, వాయిస్ మెడిసిన్ వంటి అంశాలపై శాస్త్రీయ వివరణలు, వీడియో ప్రదర్శనలతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా స్వర ఆరోగ్యంపై ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాలని కాంటినెంటల్ హాస్పిటల్స్ లక్ష్యంగా పెట్టుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.