
Constantin Fahlberg Found A New Sweetness For The World After Forgetting To Wash Hands
కొన్నిసార్లు గొప్ప ఆవిష్కరణలు పక్కా ప్రణాళికలతో కాదు, అనుకోని పొరపాట్ల నుంచి పుడతాయి. అలాంటి ఓ సంఘటనే ప్రపంచానికి తొలి ఆర్టిఫిషియల్ స్వీటెనర్ అయిన 'శాకరిన్'ను పరిచయం చేసింది.
కొన్నిసార్లు గొప్ప ఆవిష్కరణలు పక్కా ప్రణాళికలతో కాదు, అనుకోని పొరపాట్ల నుంచి పుడతాయి. అలాంటి ఓ సంఘటనే ప్రపంచానికి తొలి ఆర్టిఫిషియల్ స్వీటెనర్ అయిన 'శాకరిన్'ను పరిచయం చేసింది. ప్రయోగశాలలో రోజంతా పనిచేసి, చేతులు శుభ్రం చేసుకోవడం మరిచిపోయిన ఓ శాస్త్రవేత్త చేసిన చిన్న పొరపాటే ఈ అద్భుతమైన తీపి ఆవిష్కరణకు దారితీసింది. ఈ ఆసక్తికర ఘటన 1879లో చోటుచేసుకుంది.అసలేం జరిగింది?అమెరికాలోని ప్రఖ్యాత జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో రసాయన శాస్త్రవేత్త కాన్స్టాంటిన్ ఫాల్బర్గ్, ప్రొఫెసర్ ఇరా రెమ్సెన్ ప్రయోగశాలలో పనిచేసేవారు. ఆయన బొగ్గు తారు (coal tar) సమ్మేళనాలపై పరిశోధనలు చేస్తున్నారు. ఒకరోజు ప్రయోగాలన్నీ ముగించుకుని, అలసిపోయి ఇంటికి వెళ్లారు. అయితే, ప్రయోగశాల నుంచి వచ్చిన తర్వాత చేతులు, చేతులను శుభ్రంగా కడుక్కోవాలన్న విషయాన్ని ఆయన పూర్తిగా మరిచిపోయారు.అదే చేతులతో భోజనానికి కూర్చుని, ఒక రొట్టె ముక్కను కొరకగానే ఆయన ఆశ్చర్యపోయారు. ఆ రొట్టె ఎన్నడూ లేనంత విపరీతమైన తీపితో అనిపించింది. అసలు ఈ తీపి ఎక్కడ నుంచి వస్తోందో ఆయనకు అర్థం కాలేదు. కాసేపటికి ఆయనకు అసలు విషయం బోధపడింది. ఆ తీపి రొట్టెది కాదు, తన చేతులపై అంటుకున్న ఏదో రసాయనానిది అని గ్రహించారు. వెంటనే ఆయన ప్రయోగశాలకు తిరిగి పరుగుపెట్టారు.తీపి మూలాన్ని గుర్తించడంప్రయోగశాలకు వెళ్లిన ఫాల్బర్గ్, తాను ఆ రోజు పనిచేసిన రసాయనాలను, మిశ్రమాలను ఒక్కొక్కటిగా రుచి చూడటం ప్రారంభించారు. ఆ రోజుల్లో శాస్త్రవేత్తలకు ఇది సాధారణ విషయమే. అలా రుచి చూస్తున్న క్రమంలో 'బెంజోయిక్ సల్ఫిమైడ్' అనే రసాయనానికి అత్యంత తీపి




