తమిళనాడు సీఎం విజయ్, స్టార్ హీరోయిన్ త్రిషలు మరోసారి వార్తల్లో నిలిచారు. యూకేలోని సిల్వర్‌స్టోన్‌లో జరిగిన అజిత్ కుమార్ ‘లే మాన్స్ కప్’ రేసులో వీరిద్దరూ కలిసి కనిపించారు. ఈ కార్యక్రమాన్ని సీఎం విజయ్ జెండా ఊపి ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ముఖ్యంగా విజయ్- త్రిషలకు సంబంధించి ఒక వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రేసింగ్ ఈవెంట్‌ను విజయ్ గ్యాలరీ నుంచి వీక్షిస్తుండగా సడెన్‌గా త్రిష మధ్యలోకి వచ్చింది. అయితే విజయ్ వెంటనే తన ముఖం వీడియోలో పడకుండా పక్కకు తప్పుకునేందుకు ప్రయత్నించాడు. కానీ అది వర్కవుట్ కాలేదు. వీరిద్దరు కలిసిన వీడియో నెట్టింట వైరల్ అయింది. దీంతో త్రిష, విజయ్‌ల స్నేహం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా ప్రముఖ నటి అంబిక స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. త్రిష స్థానంలో ఉంటే తాను అలా కెమెరాల ముందు కనిపించేదాన్ని కాదని పేర్కొన్నారు.