
ఆంధ్రప్రదేశ్లో బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని తెలిపారు. అమరావతి: బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెప్పారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడం కేవలం ఎన్నికల హామీ కాదని, అది తమ రాజకీయ సిద్ధాంతంలో భాగమని చంద్రబాబు స్పష్టం చేశారు. హామీలు ఇవ్వడంతోనే ఆగిపోకుండా వాటిని అమలు చేసి చూపిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం బిసిలకు రిజర్వేషన్ల విషయంలో చేసిన అన్యాయన్ని సరిచేయడానికి ప్రత్యేక క్యాబినెట్ పెట్టి నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు. 2024 ఎన్నికల్లో ఈ స్ధాయి గెలుపుకు కారణం బిసిల వల్లేనని చెప్పుకొచ్చారు. 94శాతం స్ట్రయిక్ రేట్ 57శాతం ఓట్లు వచ్చాయంటే అది బిసిల వల్ల, నాయకత్వంపై ఉన్న నమ్మకం వల్ల మాత్రమేనని పేర్కొన్నారు. బిసిలకు న్యాయం చేయాలని తాను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు ఎన్నికలకు ముందే నిర్ణయం తీసుకున్నామన్నారు
.