
Chirala: బీసీలకు 34% రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయం ఎమ్మెల్యే మాలకొండయ్య Chirala: తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ:- ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని అన్నారు. బీసీల సామాజిక, రాజకీయ, ఆర్థిక సాధికారతకు ఈ నిర్ణయం బలమైన పునాది అని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే చిరకాల ఆకాంక్షను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్ , రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ వర్గాల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. బీసీ యువత, బీసీ మహిళలకు రాజకీయంగా ఉన్నత స్థానం కల్పించడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇప్పటివరకు రాజకీయంగా వెనుకబడిన, అణగారిన బీసీ కులాలకు నాయకత్వ అవకాశాలు కల్పించి, వారిని రాజకీయంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే టీడీపీ లక్ష్యమన్నారు. రాబోయే స్థానిక సంస్థల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతోనే 34 శాతం రిజర్వేషన్ల నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. “బీసీ యువత ఎదగాలి.. బీసీ మహిళలు నాయకత్వం వహించాలి.. అణగారిన బీసీ కులాలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం దక్కాలి. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా కాకుండా పాలనలో భాగస్వాములుగా, నాయకులుగా తీర్చిదిద్దడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం” అని ఎమ్మెల్యే మాలకొండయ్య అన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ గారు ప్రారంభించిన