
పర్యావరణ పరిరక్షణను ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ఇంటింటి ఉద్యమంగా మార్చి, గ్రామాలను స్వచ్ఛంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు 'నెట్‌జీరో' విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించి, పర్యావరణహిత జీవనశైలిని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. శనివారం 'స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని అలవరం కోడూరు గ్రామంలో సీఎం పర్యటించారు.ఈ సందర్భంగా, గ్రామంలో అమలు చేస్తున్న నెట్‌జీరో కార్యక్రమాల గురించి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ముఖ్యమంత్రికి వివరించారు. ఇంటింటా సౌర విద్యుత్ వినియోగం, పరిశుభ్రమైన వంట విధానాలు, తడి చెత్తతో సేంద్రియ ఎరువుల తయారీ, మురుగునీటిని ఇంటి వద్దే శుద్ధి చేయడం వంటి పద్ధతుల ద్వారా గ్రామాలను ఎలా ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారో తెలిపారు.క్షేత్రస్థాయిలో కార్యక్రమాల పరిశీలనకార్యక్రమం అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు, గ్రామానికి చెందిన జె. మహేశ్వరరావు ఇంటిని సందర్శించారు. మహేశ్వరరావు కుటుంబం చేపడుతున్న పర్యావరణహిత కార్యక్రమాలను సీఎం ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. వంటింటి నుంచి వెలువడే తడి వ్యర్థాలను ప్రత్యేక కంపోస్ట్ గుంతలో వేసి సేంద్రియ ఎరువుగా మార్చుతున్న విధానాన్ని వారు ముఖ్యమంత్రికి చూపించారు. దీనివల్ల ఎరువుల ఖర్చు తగ్గడమే కాకుండా, వ్యర్థాల నిర్వహణ భారం కూడా తగ్గుతుందని వివరించారు.అలాగే, ఇంటి నుంచి వెలువడే మురుగునీటిని బయటకు వదలకుండా, ఆవరణలోనే నిర్మించిన ఇంకుడు గుంతలోకి మళ్లిస్తున్న విధానాన్ని సీఎం పరిశీలించారు. ఈ 'ఇన్‌సిటు వేస్ట్‌వాటర్ మేనేజ్మెంట్' వల్ల రోడ్లపై మురుగు నిలవకుండా, దోమల బెడద తగ్గి, ఆరోగ్యకరమైన వాతావరణం