
AP: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా రమాదేవి, వర్ల రామయ్య! AP: గవర్నర్ కోటాలో భర్తీ చేయనున్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తూ ఒక స్థానాన్ని ఎస్సీ వర్గానికి, మరో స్థానాన్ని బీసీ వర్గానికి కేటాయించినట్లు సీఎం వెల్లడించారు. ఎస్సీ కోటాలో వర్ల రామయ్యకు, బీసీ కోటాలో దళవాయి రమాదేవికి అవకాశం కల్పించారు. దీంతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎంపికలోనూ సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇచ్చామని టీడీపీ స్పష్టం చేసింది. బీసీలకు రాజకీయంగా పెద్దపీట వేస్తున్న పార్టీగా టీడీపీకి ఉన్న గుర్తింపును ఈ నిర్ణయం మరోసారి చాటుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. బీసీల పార్టీ అని చెప్పుకోవడం మాత్రమే కాకుండా.. ఆ వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించడంలోనూ ఆచరణలో చూపిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా సాధారణ బీసీ కుటుంబం నుంచి వచ్చిన దళవాయి రమాదేవిని చట్టసభలోకి పంపించడం సామాజికంగా ప్రాధాన్యం కలిగిన నిర్ణయంగా టీడీపీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. రమాదేవి ఎంపికలో కేవలం రాజకీయ ప్రాతిపదికనే కాకుండా పార్టీకి, క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో ఉన్న అనుబంధం, సామాజిక ప్రాతినిధ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒడ్డెర సామాజిక వర్గానికి చెందిన ఆమెకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడం ద్వారా రాజకీయంగా వెనుకబడిన వర్గాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలన్న సంకేతాన్ని ప్రభుత్వం ఇచ్చింది. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తికి చట్టసభలో స్థానం కల్పించడం ద్వారా సామాజిక న్యాయాన్ని కేవలం నినాదంగా కాకుండా ఆచరణలో చూపిస్తున్నామని టీడీపీ చెబుతోంది. మరోవైపు ఎస్సీ వర్గానికి చెందిన సీనియర్ నేత వర్ల రామయ్యకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీతో ఆయనకు ఉన్న దీర్ఘకాల అనుబంధం, ప్రజా సమస్యలపై ఆయన చేసిన పోరాటాలను పరిగణనలోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులకు ప్రత్యేక