
సాధారణంగా చాలామంది తమ వద్ద ఉన్న నగదును బ్యాంకులోని పొదుపు ఖాతా (సేవింగ్స్ అకౌంట్)లో జమ చేస్తుంటారు. అయితే, ఒక ఆర్థిక సంవత్సరంలో ఎంత మొత్తం వరకు నగదు జమ చేయవచ్చనే దానిపై చాలామందికి స్పష్టత ఉండదు. ఈ నిబంధనలను విస్మరిస్తే ఆదాయ పన్ను (Income Tax) శాఖ నుంచి నోటీసులు ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి నగదు లావాదేవీల విషయంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి.రూ.10 లక్షల పరిమితి దాటితే ఏంటి పరిస్థితి?ఒక వ్యక్తి తన సేవింగ్స్ ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలకు మించి నగదు జమ చేస్తే, ఆ సమాచారాన్ని సంబంధిత బ్యాంకు తప్పనిసరిగా ఆదాయ పన్ను శాఖకు నివేదిస్తుంది. ఈ మొత్తాన్ని ఒకేసారి డిపాజిట్ చేసినా లేదా పలు దఫాలుగా జమ చేసినా ఈ నిబంధన వర్తిస్తుంది.అయితే, రూ.10 లక్షల పరిమితి దాటినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం నగదు జమ చేసినందుకు పన్నులు లేదా జరిమానాలు విధించరు. కానీ, ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆ డబ్బు మూలాన్ని (Source of Funds) గురించి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. మీరు మీ ఆదాయ పన్ను రిటర్నుల (ITR)లో ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో స్పష్టంగా వెల్లడించాల్సి ఉంటుంది. జీతం, వ్యాపార లాభాలు, ఆస్తుల అమ్మకం, అద్దె ఆదాయం వంటి చట్టబద్ధమైన మార్గాల ద్వారా వచ్చిన డబ్బు అయితే, నిబంధనల ప్రకారం పన్ను చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీనికి సంబంధించిన ఆధారాలు