
దేశీయ ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ప్రైవేట్ టెలికాం సంస్థలకు సవాలు విసురుతూ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో వ్యూహాత్మక ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులకు అతితక్కువ ధరకే వేగవంతమైన ఇంటర్నెట్తో పాటు అపరిమిత వినోదాన్ని అందించేందుకు రూ.999 ప్లాన్‌ను అధికారికంగా ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ తన అధికారిక ఎక్స్ వేదికగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ ఫైబర్ (ఎఫ్టీటీహెచ్) బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో నెలకు 200 Mbps గరిష్ట వేగంతో ఏకంగా 5000GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. దీనికి తోడు దేశవ్యాప్తంగా ఉచితంగా అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. డిజిటల్ కంటెంట్ ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో ఈ ప్లాన్‌తో ఉచితంగా JioHotstar, Sony LIV, ZEE5, Hungama OTT, Shemaroo OTT వంటి ప్రముఖ వినోద ప్లాట్‌ఫారమ్‌ల మెంబర్‌షిప్‌లను కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఓటీటీ ప్రియుల కోసం బీఎస్ఎన్ఎల్ మరొక ప్రత్యేక ‘ఫ్రీడమ్ ఆఫర్’ను కూడా ప్రవేశపెట్టింది. దీనికింద కొత్త, పాత ఎఫ్టీటీహెచ్ కస్టమర్లు కేవలం రూ.150లకే (సాధారణ ధర రూ.199) Sony LIV, JioHotstar, ZEE5 సభ్యత్వాలను 30 రోజుల పాటు పొందే వెసులుబాటు ఉంది. అంతేకాకుండా, మొబైల్ వినియోగదారుల కోసం కేవలం రూ.51కే కొత్త సిమ్ కార్డ్‌తో పాటు నెలకు రోజుకు 2GB డేటా, రోమింగ్‌తో సహా ఉచిత కాలింగ్, రోజుకు 100 SMSలు అందించే ఆఫర్ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. 'హుషారు పిట్టలు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు) ఆషిక బర్త్ డే సెలబ్రేషన్స్.. అక్క-బావ సర్ప్రైజ్ గిఫ్ట్ (ఫొటోలు) హీరోయిన్ హన్సిక బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు) ప్రియాంక ఘటనపై జూపల్లి కృష్ణ రావు సంచలన వ్యాఖ్యలు నీకు దమ్ముంటే నీ కొడుకుని రాజీనామా చేయమని చెప్పు మా జగనన్న సీఎం అయ్యాక.. ఫస్ట్ ఓపెన్ చేసేది DSCఫైలే.. పేర్ని కిట్టు వార్నింగ్