
సిరి గురించి మీకక్కర్లేదు పిన్నీ. ఇక నీ కొడుకు అంటావా.. నువ్వు చేసిన తప్పులకు ఆ దేవుడే నీకు ఈ శిక్ష వేశాడని రేఖతో అంటాడు రాజు. ఏయ్ రాజు అని రేఖ అనగా.. అవును పిన్నీ, నేను చెప్పినప్పుడు నువ్వు నీ తప్పును సరిదిద్దుకుని ఉంటే.. ఈరోజు నీ కొడుకును నిన్ను వదిలేసి వెళ్లేవాడే కాదు, అసలు నీ కొడుకు నిన్ను వదిలి వెళ్లిపోయాడనే బాధ ఏమైనా ఉందా, నిజంగానే బాధ ఉండుంటే తిరిగి తెచ్చుకో. అంతేకానీ మా మధ్య గొడవలు పెట్టాలని చూడకు. ఒకవేళ చూస్తే.. అని రాజు అనగానే శేషు.. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, మాకర్థం అయిందని అంటాడు. దీంతో రాజు ఇందును తీసుకుని తన గదికి వెళ్లిపోతాడు. పైకి వెళ్లగానే.. రాజు ఏమైంది, అంత పొద్దున్నే ఎందుకు ఆస్పత్రికి వెళ్లావని అడుగుతుంది ఇందు. సిరి స్పృహలోకి వచ్చిందా అని ప్రశ్నిచంగానే.. వాళ్ల బెడ్రూం తలుపులు మూసొచ్చి మరీ సిరి కోమాలోంచి బయటకు వచ్చిందని చెబుతాడు. మరి నువ్విక్కడకు వచ్చావేంటి, ఈ విషయం ముందే చెబితే నేనే వచ్చేదాన్ని కదా అంటుంది ఇందు. సరే ఇప్పుడెల్దాం పదా అని ఇందు అనగానే.. ఇందు కూల్.. సిరి ఆస్పత్రిలో లేదని అంటాడు రాజు. డిశ్చార్జ్ అయిందని చెబుతాడు. మరిప్పుడు తను ఎక్కడుంది అనగా.. మా ఇంట్లో పెట్టానంటాడు. ఏంటి మీ ఇంట్లో పెట్టావా అలా ఎందుకు చేశావు రాజు, అసలే అంకుల్ వాళ్లకు నీ మీద చాలా కోపం ఉంది, అలాంటప్పుడు నువ్వు తనని అక్కడ పెడితే నీ మీద కోపం పెంచుకుంటారు కదా అంటుంది ఇందు. మరి నన్నేం చేయమంటావు ఇందు.. సిరికి గతం గుర్తు లేదని వివరిస్తాడు. దీంతో ఇందు షాక్ అవుతుంది. తనకి గతం గుర్తు లేదా అనగా.. అవును తను ఆరేళ్ల చిన్న పాపలా మారిపోయిందంటాడు. అయ్యో ఇదేంటి రాజు ఇలా జరిగిందని ఇందు అనగా.. అదే నాకూ అర్థం కావట్లేదంటాడు రాజు. సిరి స్పృహలోకి వస్తే నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయనుకున్నాను.. కానీ ఇలా జరుగుతుందని అస్సలే ఊహించలేదంటాడు. ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే ఏ క్షణంలోనైనా తనకు గతం గుర్తుకు రావొచ్చని డాక్టర్ చెప్పాడని, అందుకే తన ఇంట్లోనే పెట్టొచ్చానని చెబుతాడు. మరి ఆంటీ, అంకుల్ ఏమనలేదా అని ఇందు అడగ్గా.. ఎందుకనలేదు, కొడుకును కదా కోపంలో కూడా నన్ను అర్థం చేసుకున్నారు, తనని అక్కడ ఉంచుకునేందుకు ఒప్పుకున్నారని వివరిస్తాడు. ఇలా అయితే వాళ్లకు ఇబ్బంది అవుద్ది కదా అని ఇందు అంటుంది. సిరిని అక్కడకు కాకుండా నేరుగా ఇక్కడికే తీసుకువచ్చుంటే బాగుండేది అని ఇందు అనగా.. ఏయ్ ఏం మాట్లాడుతున్నావని రాజ్ అంటాడు. నేను సిరి దగ్గరకు వెళ్లానని ఊహించుకునే రేఖ పిన్ని వాళ్లు ఎన్ని మాటలు అన్నారో చూశావు కదా, అలాంటిది సిరిని డైరెక్ట్‌గా ఇక్కడికే తీసుకొచ్చి పెడితే చాలా మాటలు అంటారని చెబుతాడు. అనేవాళ్లు ఎప్పుడూ అంటూనే ఉంటారని, అలాంటి వాళ్ల గురించి ఆలోచిస్తూ.. మనం చేయాలనుకున్న పని చేయకపోతే నష్టపోయేది మనమే కదా అని అంటుంది ఇందు. సిరి ఇప్పుడు చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంది అంటున్నావ్.. తననిప్పుడు కంటికి రెప్పలా చూస్కుంటూ ఉండాలి కదా అంటుంది. అందుకే తనను మన దగ్గరే పెట్టుకుందామని అంటుంది. వద్దు ఇందు అని రాజు అనగా.. ఎందుకంటుంది అతడి భార్య. దీంతో రాజు.. నిన్ను ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదని చెబుతాడు. నాకేం ఇబ్బంది లేదని ఇందు అనగా.. నీకే ఇబ్బందీ లేకపోయినా నిన్ను ఎవరైనా ఏమైనా అంటే నేను తట్టుకోలేని అంటాడు. రాజు అని ఎమోషనల్ అవుతుంది ఇందు. దీంతో రాజు.. ఇప్పటికే నువ్వు నాకోసం చాలా చేశావు, అందరితో చాలా మాటలు పడ్డావు, ఇంకా నా వల్ల నువ్వు మాటలు పడడం నాకిష్టం లేదు, కొన్నాళ్ల పాటు తను అక్కడే ఉంటుంది. ఉండనివ్వు అంటాడు. అది కాదు రాజు అని ఇందు అనగా.. సిరి విషయంలో నేనో డిసీషన్ తీస్కున్నాను.. కంపెనీలో చాలా పెండింగ్ వర్క్స్, డీల్స్ ఉన్నాయన్నావుగా ముందు నువ్వు వాటి గురించి ఆలోచించు అని చెబుతాడు. మరోవైపు సిరి రెండు జడలు వేయించుకుని తెగ మురిసిపోతుంది. చలపతి ఫోన్ మాట్లాడే దగ్గరే నిలబడి మరీ.. రెండు జడలు రెండు జడలు అంటూ కేకలు వేస్తుంది. దీంతో చలపతి.. ఏయ్ సైలెంటుగా ఉండు అంటాడు. ఏ పో అంటూ అక్కడే అల్లరి చేస్తుంది సిరి. ఏయ్ చెప్తున్నానుగా, సైలెంటుగా ఉండని చలపతి అన్నా పట్టించుకోకుండా ఆడుకుంటుంది సిరి. దీంతో ఫోన్ పెట్టేసి కోపంగా వచ్చిన చలపతి.. ఏయ్ నీకు బుద్ధుందా లేదా అంటాడు. నేనేమన్నాను అని సిరి అనగా.. నోర్ముయ్ అంటాడు. ఓవైపు ఫోన్ మాట్లాడుతుంటే రయ్, రయ్ అని కేకలు వేస్తున్నావని అరుస్తాడు. ఒకసారి చెప్తే నీకర్థం కాదా అనగా.. నాక్కాదు నీకే అర్థం కావట్లేదు, బ్యాడ్ అంకుల్, చపాతీ అంకుల్ అంటూ తిడ్తుంది సిరి. దీంతో మరింత కోపం తెచ్చుకున్న చలపతి.. నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి కారణం నేనే అంటాడు. దీంతో సిరి లేదు ఇది నా ఇల్లు అంటుంది. ఆహా అంతదాకా వచ్చిందా అనగా.. ఉండు నీ గురించి నా మొగుడికి చెప్తానంటుంది. ఏయ్ మొగుడంటావేంటి మొగుడు అని చలపతి అనగా.. అప్పుడే లక్ష్మీ వచ్చి ఎందుకండి అంతగా అరుస్తున్నారని అడుగుతుంది. చలపతి మాత్రం.. ఇదేంటి రాజును మొగుడు అంటుందని అడుగుతాడు. నాకు ఒళ్లు మండిపోతుందని చెప్పగా.. నా మొగుడిని మొగుడనే పిలుస్తాను, నీకెందుకుని ప్రశ్నిస్తుంది సిరి. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన చలపతి అరుస్తుండగా.. వెంకీ నాన్నా అంటాడు. ఇది ఫోన్ మాట్లాడుతుంటే ఒకటే అరుస్తోందని చెప్తాడు. లక్ష్మీ మాత్రం.. అది చిన్న పిల్ల కదండీ.. వదిలేయండని అంటుంది. చిన్న పిల్లేంటి, చిన్న పిల్ల అని చలపతి అనగా.. తన గురించి తెల్సిందేగా అని లక్ష్మీ చెబుతుంది. దీంతో మీ ఇష్టం వచ్చినట్లు చేస్కోండని చెప్పి, ఈ వెర్రిదాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేంగడని అంటాడు. దీంతో సిరి.. నీకే వెర్రి అనగా.. చలపతి కొట్టేందుకు చేయి లేపుతాడు. దీంతో సిరి ఏడుపు మొదలు పెడుతుంది. దీంతో చలపతి వెళ్లిపోగా.. లక్ష్మీ మాత్రం ఏడవకు, ఆయనలాగే ఉంటారని చెబుతుంది. కానీ సిరి మాత్రం నేనిక్కడ ఉండను, నాకు నా మొగుడు కావాలని ఏడుస్తుంది. నా మొగుడు కావాలి, నా మొగుడు కావాలి, రమ్మను అంటుంది. సరే నేను చేస్తాను నువ్వాగు అన్నా వినకుండా.. వెంకీ నువ్వు ఫోన్ చేయు అని చెప్తుంది సిరి. తను చేస్తాడు కానీ.. నీకోసం ఇష్టమైన నూడుల్స్ చేశాను, తీసుకొస్తానుండని లక్ష్మీ చెబుతుంది. కానీ సిరి మాత్రం ఏడుపు ఆపకుండా నాకు నా మొగుడు కావాలని గోల చేస్తుంది. లక్ష్మీ నూడుల్స్ తీసుకువచ్చి ఇచ్చినా.. నాకొద్దు, చపాతీ అంకుల్ నన్ను తిట్టాడని చెబుతుంది. కానీ తను వినకపోయేసిరికి ఇప్పుడేం చేద్దామని లక్ష్మీ అంటుంది. దీంతో కాస్తాగమ్మా అంటూ లోపలికి వెళ్లిన వెంకీ.. బెలూన్లు చేత పట్టుకుని జోకర్ వేషంతో బయటకు వస్తాడు. సిరి అంటూ పిలవగానే ఏడుపు పైకి లేచిన సిరి ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. కానీ వెంకీ మాత్రం ఆమెను నవ్వించేందుకు విపరీతంగా కష్ట పడతాడు. చివరకు సిరి నవ్వగా.. ఆమెకు నూడుల్స్ తనిపించేందుకు వెంట పరుగులు పెడతాడు. కానీ తన దొరక్క ఆయాసం రావడంతో.. సిరియే అతడి దగ్గరు వచ్చి ఆ అంటుంది. దీంతో వెంకీ ఆమెకు కడుపునిండా తినిపిస్తాడు. ఆ తర్వాత రేఖ ఓ చోట కూర్చుని ఉండగా.. భ్రమరం అక్కడకు వస్తుంది. ఆ రాజును ఏమైనా చేయాలి, మనం పగ తీర్చుకోవాలని చెబుతుంది. వాడిప్పడికే నీ వల్లే మదన్ ఇంట్లోంచి వెళ్లిపోయాడని అంటున్నాడని, అసలు మన పిల్లల్ని మనకు దూరం చేసి, వాళ్లు మాత్రం హ్యాపీగా ఉంటున్నారని చెబుతుంది. అక్కడితో ఆగకుండా ఈ ఇందు మామూలిది కాదు, ఆ రాజుగాడిని చూస్కోని రెచ్చిపోతుందని వివరిస్తుంది. తన ఇష్టానుసారంగా చేస్తుందని, వాళ్లను ఇలాగే వదిలేస్తే మనకు చాలా ప్రాబ్లమ్ అవుతుందని చెబుతుంది. ప్రాబ్లమ్ అవ్వదు, నకు ఇప్పటి వరకు జరిగిన నష్టం చాలు, ఇకపై ఏ నష్టం జరగనివ్వనని రేఖ అంటుంది. అప్పుడే ఐశ్వర్య అక్కడకు రాగా.. రేపటి నుంచి నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెబుతుంది. హాల్ టికెట్ తీస్కోవాలంటే ఒక 5 వేలు కట్టాలని చెబుతుంది. అంటే నువ్వు ఇప్పుడు మా రేఖను రూ.5 వేలు అడగడానికి వచ్చావా అని భ్రమరం అనగా.. బాగుందమ్మా, చాలా బాగుంది, మా రేఖ చేతిలో పెత్తనం ఉన్నప్పుడు నువ్వు అడక్కపోయినా లక్షలు, లక్షలు అలా ఇచ్చేసేదని గుర్తు చేస్తుంది. అలాంటిదిప్పుడు ఈ ఇందు పెత్తనం తీస్కోగానే నీ బతుకు ఎంతగా దిగజారిందో చూశావా అంటూ నిలదీస్తుంది. చీప్‌గా 5, 10 వేల కోసం కూడా చేయి చాపాల్సి వస్తుందని అంటుంది. దీంతో కోప్పడ్డ ఐశ్వర్య.. పిన్నీ అంటూ ఫైర్ అవుతుంది. ఏంటి కోపం వచ్చిందా అని భ్రమరం అనగా.. దీన్ని అడుక్కోవడమనే కదా అంటారని అంటుంది. దీంతో రేఖ.. వదినా అలా మాట్లాడొద్దని చెబుతుంది. ఎంతైనా ఇందు, ఐశు అక్కాచెల్లెల్లు కదా.. నువ్వు ఇందును ఏమైనా అంటే ఐశు బాధ పడుతుందని చెబుతుంది. ఆంటీ నేను బాధ పడను అని ఐశు అనగా.. పాపం నిన్ను చూస్తుంటే, నాకు జాలేస్తుందని చెబుతుంది. నువ్వు ఇందుకు అక్కగా మారిపోయి ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో అనగా.. ఆంటీ నేను ఆ ఇందుకు అక్కను కానని చెబుతుంది. నేను మీ ఐశును అని వివరిస్తుంది. ఇప్పుడు, ఎప్పడు, ఎప్పటికీ.. మీరు పెంచిన మీ ఐశునే అని చెబుతుంది. ఈ ఇందు అంటే నాకెప్పుడూ కోపమే అంటుంది. అది నా శత్రువు, బద్ధ శత్రువు, నేను దాని మీద గెలవాలని శపథం చేశానని, నేను కచ్చితంగా డిగ్రీ పాసై తనచేత నాకు కంపెనీ పెట్టిస్తానని చెబుతుంది. శభాష్ ఐశు.. శభాశ్.. ఇప్పుడు నువ్వు నీలా మాట్లాడావు, అనుకున్నది సాదిస్తావు అంటుంది. ఏంటి 5 వేలు అన్నావు కదా పంపించాను చూస్కో అంటూ.. ఐశ్వర్యకు డబ్బులిస్తుంది రేఖ. అయితే ఇందు గురించి అందరికీ తెలియాలంటే నువ్వు ఓ పని చేయాలని చెబుతుంది. ఏంటని ఐశు అనగా.. నువ్వు డిగ్రీ పాసైతే, నీతో కంపెనీ పెట్టిస్తానని ఇందు చెప్పింది కదా, కానీ దానికి నువ్వు డిగ్రీ పాసవ్వడం అస్సలే ఇష్టం లేదని అంటుంది. కానీ ఐశు మాత్రం అలాంటిదేమీ లేదు ఆంటీ అని చెబుతుంది. దీంతో నువ్వెళ్లి ఇందును కూడా డబ్బులు అడుగు అనగా.. దాన్ని అడగలేకే కదా నేను మిమ్మల్ని డబ్బులు అడిగింది అంటుంది ఐశ్వర్య. అది నాకర్థం అవుతుంది ఐశు.. అందుకేగా నేన్నీకూ డబ్బులు ఇచ్చాను అని చెబుతుంది రేఖ. మరెందుకు డబ్బులు అడగడం అనగా.. నవ




