
BJP New Team| ఇంటర్నెట్ డెస్క్: భాజపా నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. 13 మంది జాతీయ ఉపాధ్యక్షులతో పాటు వివిధ పదవులకు ఎంపికైన వారి జాబితాను ప్రకటించింది. భాజపా జాతీయ ఉపాధ్యక్షుల జాబితాలో కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari), రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే సింధియాతో పాటు తీరథ్ సింగ్ రావత్ (ఉత్తరాఖండ్), రామ్ మాధవ్ (దిల్లీ), బైజయంత్ జయ్ పాండా (ఒడిశా), రేఖా వర్మ, వర్షాబెన్ నరేంద్రభాయ్ దోషీ (గుజరాత్), డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ (మహారాష్ట్ర), సర్దార్ మన్‌ప్రీత్ సింగ్‌బాదల్ (పంజాబ్), లాల్ సింగ్ ఆర్య (మధ్యప్రదేశ్), ప్రొఫెసర్ ఎం.నాగరాజా (కర్ణాటక), ప్రొఫెసర్ తారిఖ్ మన్సూర్ (ఉత్తర్‌ప్రదేశ్), డాక్టర్ మధుచంద్ర కర్ (పశ్చిమబెంగాల్)లకు చోటు దక్కింది. వీరంతా భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సారథ్యంలో పనిచేయనున్నారు. అలాగే, కేంద్ర మాజీమంత్రి స్మృతి ఇరానీ జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో ఒకరిగా నియమితులై పార్టీలోని కీలకమైన సంస్థాగత బాధ్యతల్లోకి తిరిగి వచ్చారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు