
Medak: 200 మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన హోరెత్తిన 'తిరంగా యాత్ర'! Medak: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జాతీయ జెండా పండుగ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా దేశభక్తి ర్యాలీ నిర్వహించారు. బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వల్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర నాయకులు రంజిత్ కుమార్ తో పాటు బీజేపీ నర్సాపూర్ నియోజకవర్గం నాయకుల తో పాటు సుమారు 1000 మంది విద్యార్థులు,పట్టణ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. నర్సాపూర్ పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. విద్యార్థులు, నాయకులు కలిసి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా 200 మీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాను విద్యార్థులు, నాయకులు చేతుల మీదుగా ప్రదర్శించారు. చేతుల్లో త్రివర్ణ పతాకాలు, నోట దేశభక్తి నినాదాలు, అడుగడుగునా జాతీయ భావం. ఇలా సుమారు వెయ్యి మందితో సాగిన భారీ ర్యాలీతో నర్సాపూర్ పట్టణం త్రివర్ణ పతాకాలతో కళకళలాడింది. ‘భారత్ మాతాకీ జై’, ‘వందే మాతరం’ నినాదాలతో పట్టణ వీధులు మార్మోగాయి. ర్యాలీని చూసిన ప్రజలు సైతం దేశభక్తి భావంతో కార్యక్రమానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్దాస్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ.. జాతీయ జెండా ప్రతి భారతీయుడి గుండెల్లో ఉన్న దేశభక్తికి ప్రతీక అని అన్నారు. త్రివర్ణ పతాకం వెనుక స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, దేశ ప్రజల ఐక్యత, భారతదేశ గొప్ప చరిత్ర దాగి ఉన్నాయని పేర్కొన్నారు. జాతీయ జెండాను గౌరవించడం అంటే దేశాన్ని, దేశ సైనికులను, అమరవీరుల త్యాగాలను గౌరవించడమేనని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భారతదేశాన్ని ప్రపంచంలోనే శక్తివంతమైన, అభివృద్ధి చెందిన